Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్‌తో జాగ్రత్త! హార్ట్ స్ట్రోక్ సమస్యతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని స్టడీలు చెప్తున్నాయి. ఉన్నట్టుండి మెదడుకి రక్తప్రసరణ ఆగిపోవడం ద్వారా ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన మెదడుపోటుని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 25 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Brain Stroke Symptoms, Causes and Treatment: హార్ట్ స్ట్రోక్ సమస్యతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని స్టడీలు చెప్తున్నాయి. ఉన్నట్టుండి మెదడుకి రక్తప్రసరణ ఆగిపోవడం ద్వారా ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన మెదడుపోటుని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో రక్తనాళాలు చిట్లడం వల్ల తలెత్తే పోటును బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. హార్ట్ స్ట్రోక్ (Heart Stroke) లాగానే ఇది కూడా ఎమర్జెన్సీ కండీషన్. సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చు. అసలీ బ్రెయిన్ స్ట్రోక్ ఎలా, ఎందుకు సంభవిస్తుందంటే. మెదడులోకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు అత్యంత చిన్న సైజులో సూక్ష్మాతిసూక్ష్మంగా ఉంటాయి. అయితే తలకు దెబ్బ తగిలినా లేదా రక్తపోటు అధికంగా పెరిగినా రక్తనాళాలు ఒత్తిడి తట్టుకోలేక చిట్లిపోతుంటాయి. ఈ సందర్భంలో మెదడు ఒక్కసారిగా షాక్‌కు గురవుతంది. అలాగే భరించలేని నొప్పి కూడా మొదలవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ మెదడులోని ఏ భాగంలో వచ్చింది అన్నదాన్ని బట్టి నష్టం జరుగుతుంటుంది. వయసుపైబడినవాళ్లకు, డయాబెటిస్, హై బీపీ సమస్యలు ఉన్నవాళ్లకు, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లకు, పుట్టుకతో రక్తనాళాలు బలహీనంగా ఉన్నవాళ్లకు, అధిక ఒత్తిడి అనుభవిస్తువాళ్లకు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. Also Read: చైనీస్ మొబైల్స్‌లో లోపాలు..వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేస్తున్న యాప్‌లు చేయకూడనివి లక్షణాలు ఇలా.. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల తలనొప్పి, వికారం వంటి లక్షణాలతోపాటు -శరీరం బ్యాలెన్స్ తప్పడం, కంటి చూపు తగ్గడం, చేయి లేదా కాలు సరిగా పనిచేయకపోవడం, మాటలు ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలవాలి. జాగ్రత్తలు ఇలా.. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండేదుకు ధూమపానానికి దూరంగా ఉండడం, డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు రాకుండా చూసుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, రోజువారీ వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడి లేని లైఫ్‌స్టైల్‌ను గడపాలి. #health-tips #brain-stroke మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి