Malla Reddy: మల్లారెడ్డి కోడలుకు విద్యార్థుల కౌంటర్.. అంతా అవినీతే అంటూ క్యాంపస్ లో లొల్లి! బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యా సంస్థల్లో వరుస దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ చేసి, మరోసారి ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజుల పేరుతో బలవంతంగా డబ్బులు గుంజుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నిస్తే ప్రీతిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతోందని వాపోతున్నారు. By srinivas 19 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Preeti Reddy Vs Malla Reddy Students: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Malla Reddy) సంబంధించిన విద్యా సంస్థల్లో వరుస దారుణాలు బయటపడుతున్నాయి. కాలేజీ యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫీజు విషయంలో మొదట ఒకమాట చెప్పి ఆ తర్వత అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొంతమందిని కావాలనే పరీక్షల్లో ఫెయిల్ చేసి, మరోసారి ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజుల పేరుతో బలవంతంగా డబ్బులు గుంజుతున్నారంటూ వాపోతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మల్లా రెడ్డి కోడలు, ప్రీతిరెడ్డితో విద్యార్థులు వాగ్వాదానికి దిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. బౌన్సర్లతో బెదిరింపులు.. ఈ మేరకు క్యాంపస్‌లోకి రాజకీయ నేతలను ఎలా తీసుకొస్తారని విద్యార్థులు ప్రశ్నించగా.. జేఎన్‌టీయూ రూల్స్ పాటిస్తున్నామన్న ప్రీతిరెడ్డి చెప్పారు. అలాగే అధిక ఫీజులు, కనీస అవసరాల గురించి వివరణ కోరగా ప్రీతిరెడ్డి దురుసుగా వ్యవహరించారు. ఆమె అసభ్యకర కామెంట్స్‌పై విద్యార్థులు మండిపడ్డారు. అంతేకాదు తమను కావాలనే డిటైన్ చేశారని మండిపడ్డారు. వారు డిటైన్ చేసిన విద్యార్థుల్లో టాపర్లు ఉన్నారని చెప్పారు. ఈ దుర్మార్గంపై అడగడానికి వెళితే కాలేజ్ లోనికి వెళ్లకుండా బౌన్సర్లతో అడ్డుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: Warangal: ఐస్ క్రీమ్ లో మూత్రం, వీర్యం.. వరంగల్ లో బయటపడ్డ దారుణం! కబ్జా చేసి ఎదిగారు.. 'మీరు పాలు, పూలు అమ్ముకొని పెద్దోళ్లు కావచ్చు. మేం చదువుకొని పెద్దోళ్లం కావాద్దా..? మీరు కబ్జా చేసి ఎదిగారు.. మేమలా చేయలేము. ఫీజుల విషయంలో చెప్పేది ఓ రేటు.. వసూలు మరోరేటు. హాస్టల్‌లో భోజనం సరిగా ఉండదు. గతంలో 300 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. ఆ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశారు. కాలేజీకి మద్యం తాగి వచ్చారని మమ్మల్ని ఎగతాళి చేశారు. టెన్త్, ఇంటర్ లో టాపర్లను సైతం ఫెయిల్ చేశారు' అంటూ మీడియాతో చెబుతూ వాపోయారు. #hyderabad #mallareddy-campus #students-concern మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి