NEET 2024: వారి ఆత్మహత్యలకు నీట్ తో సంబంధం లేదు.. సుప్రీం కోర్టు!

నీట్ పరీక్ష తప్పుడు ఫలితాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి చావులకు నీట్ యూజీ 2024 ఫలితాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ, సీబీఐ, బిహార్ ప్రభుత్వాల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.

New Update
NEET-UG: నీట్ యూజీ పరీక్షపై విచారణ వాయిదా

Supreme Court: నీట్-యూజీసీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీంతో అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమాల ఆరోపణల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఇష్యూపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.. పిటిషన్ తరపు వాదనలు విన్న అనంతరం ఈ పిటిషన్ పై రెండువారాల్లో తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, ఎన్టీఏతో పాటు సీబీఐ, బిహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు ఓ న్యాయవాది రాజస్థాన్ లోని కోటా నగరంలో విద్యా్ర్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించగా దీనిపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోటాలో ఆత్మహత్యలకు నీట్ యూజీ 2024 ఫలితాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అనవసర భావోద్వేగ వాదనలు ఇక్కడ చేయవద్దంటూ సున్నితంగా హెచ్చరించింది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసిన కోర్టు.. నీట్‌ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్‌ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది.

Also Read: గ్రూప్-2 అభ్యర్థుల‌కు అల‌ర్ట్.. ఎడిట్ ఆప్షన్ కు ఇదే చివరి తేదీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు