Indore : ప్రాణాలు తీసిన వీడియో కాల్ ప్రాంక్ ఇండోర్‌లో విద్యార్ధి ప్రాంక్ సరదా ప్రాణాలను తీసింది. ఉరి వేసుకుంటున్నట్టు నటించి ఫ్రెండ్స్‌ను ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకున్న అతని ప్లాన్ రివర్స్ అయి అతని లైఫ్‌నే ఎండ్ చేసింది. By Manogna alamuru 03 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Life Ended With Prank Call : సోషల్ మీడియా(Social Media), రీల్స్, ప్రాంక్స్... వీటికి యువత బాగా అడిక్ట్అయిపోతున్నారు. వీటిలో చాలా మందికి డబ్బులు కూడా వస్తుండడంతో మరింత రెచ్చిపోతున్నారు. అయితే ఈ సరదాలో పడి కొంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇండోర్(Indore) లో ఓ విద్యార్ధి ఇలానే ప్రాంక్(Prank Calls) చేయబోయి ఊపిరి వదిలేశాడు. ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకున్నాడు.. రెండు రోజుల క్రితం ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే(Fools Day) అయింది. ఈ రోజున తన ఫ్రెండ్స్‌ను ఫూల్ చేయాలనుకున్నాడు ఇండోర్‌లోని ఓ విద్యార్ధి. అనుకున్నదే తడవుగా ఫ్రెండ్స్‌కు వీడియో కాల్ చేశాడు. ఇవతల తాను ఊరివేసుకుంటున్నట్టు నటించాలని అనుకున్నాడు. కొంతసేపు బిల్డప్ ఇచ్చి ఏప్రిల్ ఫూల్ అని చెబుదామనుకున్నాడు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వీడియో కాల్‌లో ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుండగా కాళ్ళ కింద ఉన్న స్టూల్ పడిపోయింది. విద్యార్ధి గొంతుకు ఉరి బిగుసుకుపోయింది. దాంతో వీడియో కాల్‌లో ఉండగానే అతని మాట పడిపోయింది. ప్రాణం అనంత లోకాల్లో కలిసిపోయింది. పదకొండవ తరగతి విద్యార్ధి.. వీడియో కాల్(Video Call) లో ఫ్రెండ్ అలా చనిపోవడం చూసి అవతల ఉన్న ఫ్రెండ్స్ ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. వెంటనే అందులో నుంచి తేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వాళ్ళు వెళ్ళి విద్యార్ధిని ఆసుపత్రిలో కూడా జాయిన్ చేశారు. అయితే అప్పటికే అతని ప్రాణం పోయింది. మృతుడి పేరు అభిషేక్ అని.. పదకొండవ తరగతి చదువుతుననాడని తెలుస్తోంది. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read : Delhi : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ భార్య సునీత? #death #indore #video-call #april-fool #prank-call మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి