Stock Market: లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌!

ఉదయం స్టాక్‌ సెషన్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా లాభాలతోనే మొదలైన సెషన్ రోజు ముగిసే సరికి కూడా అదే సెషన్‌ ని కొనసాగించింది. ముఖ్యంగా చివరి గంటంలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు వరుసగా 11వ రోజూ లాభాలను ఆర్జించాయి.

New Update
Stock Market: లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌!

Stock Market: శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) ఆల్‌ టైమ్‌ లో హైగా ముగిశాయి. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్‌ లాభాల బాటలోనే నడుస్తుంది. ఈ క్రమంలోనే బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్‌ 319 పాయింట్లు పెరిగి 67 , 838 వద్ద స్థిరంగా ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 89 పాయింట్లు వృద్ధిని సాధించి 20,192 పాయింట్ల వద్ద ముగిసింది.

ఉదయం స్టాక్‌ సెషన్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా లాభాలతోనే మొదలైన సెషన్ రోజు ముగిసే సరికి కూడా అదే సెషన్‌ ని కొనసాగించింది. ముఖ్యంగా చివరి గంటంలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు వరుసగా 11వ రోజూ లాభాలను ఆర్జించాయి.

శుక్రవారం ఇండెక్స్‌ లో హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటర్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ , టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎంఅండ్ఎం, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్‌, ఎస్బీఐ, మారుతి, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్‌, యాక్సిస్‌ బ్యాంకులు లాభాల బాట పట్టాయి.

ఈ క్రమంలో ఎల్‌ అండ్ టీ, కొటాక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్‌ బ్యాంక్, ఐటీసీ, టైటాన్‌, హిందూస్తాన్‌, యూనిలివర్‌, ఏసియన్‌ పెయింట్స్‌ నష్టాల బాట పట్టాయి.

డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఇవాళ 15 పైసలు క్షీణించింది. మార్కెట్ ముగిసే సమయానికి రూ. 83.18 వద్ద స్థిరపడింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రూపాయి మారకం విలువ రూ. 83.03 గా ఉన్న విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు