BRS Party: కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!

New Update
BRS Party: కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!

బీఆర్‌ఎస్ పార్టీలో (BRS Party) కొన్నాళ్లుగా కడియం శ్రీహరి-తాటికొండ రాజయ్య మధ్య తీవ్ర వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ స్థానానికి రానున్న ఎన్నికల్లో కడియం శ్రీహరిని తమ అభ్యర్థిగా గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ప్రకటించడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) ఈ వివాదానికి తెర దించారు. మంత్రి సమక్షంలో తాజాగా జరిగిన చర్చల్లో బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధి కడియం శ్రీహరికి ఎమ్మెల్యే రాజయ్య తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం పాల్గొన్నారు. అయితే.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాజయ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హామీతోనే రాజయ్య వెనక్కు తగ్గారని సమాచారం.
ఇది కూడా చదవండి: Car Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. వివరాలివే..!!

కడియం శ్రీహరి టీడీపీలో, రాజయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాటి నుంచి ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. అయితే.. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ ఇద్దరు నేతలు గులాబీ గుటికి చేరారు. మొదట్లో ఇద్దరు బాగానే ఉన్నా.. రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, ఆ బాధ్యతలను రాజయ్యకు అప్పగించడంతో మళ్లీ వీరి విభేదాలు మొదలయ్యాయి. అనంతరం రాజయ్యపై తీవ్ర విభేదాలు రావడం, ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘనపూర్ టికెట్ ను వచ్చే ఎన్నికల్లో శ్రీహరికి ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించడంతో రాజయ్య భగ్గుమన్నారు. తనకు టికెట్ దక్కక పోవడానికి శ్రీహరి చేసిన కుట్రలే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఓ దశలో రాజయ్య పార్టీ మారుతారని వార్తలు కూడా వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ దగ్గర రాజయ్య, కడియంతో సమావేశం ఏర్పాటు చేశారు పల్లా. ఇద్దరు నేతలు కలిసి రానున్న ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్న మంత్రి సూచనకు రాజయ్య, కడియం అంగీకరించారు. దీంతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా సొంత పార్టీ నేతల మధ్య సాగుతున్న వివాదానికి చెక్ పెట్టింది బీఆర్ఎస్ హైకమాండ్.

Advertisment
Advertisment
తాజా కథనాలు