BB4 Movie : మెంటల్ మాస్ కాంబో.. బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో?

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కు విలన్ గా యాక్షన్ హీరో గోపీచంద్ ను సెట్ చేయబోతున్నారట బోయపాటి. త్వరలోనే గోపీచంద్‌కు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

New Update
BB4 Movie : మెంటల్ మాస్ కాంబో.. బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో?

BB4 Movie : నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ' మూవీకి ఇది సీక్వెల్ గా రూపొందనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో బాలయ్య కు విలన్ గా ఓ స్టార్ హీరోను సెట్ చేయబోతున్నారట బోయపాటి.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన మ్యాచో స్టార్ గోపీచంద్ అని సమాచారం. కెరీర్ స్టార్టింగ్ లో గోపించంద్ విలన్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. జయం, నిజం, వర్షం వంటి సినిమాల్లో తన విలనిజంతో అదరగొట్టిన గోపిచంద్ ను బాలయ్య సినిమా కోసం గోపీచంద్‌ను విలన్‌గా ట్రై చేస్తున్నాడట బోయపాటి. అంతేకాదు.. త్వరలోనే గోపీచంద్‌కు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Also Read : రజినీకాంత్ ‘వేట్టయాన్’ ఫస్ట్ సింగిల్ లోడింగ్…

ఒకవేళ గోపీచంద్ కనుక ఓకే అంటే థియేటర్స్ షేక్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. కాగా ఈ సినిమాను 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా.. బాలయ్య చిన్న కూతురు మొదటి సారి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ప్రెజెంట్ NBK 109 మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు బాలయ్య.. ఇది పూర్తవ్వగానే బోయపాటి సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు