AP news: అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించిన పోలీసులు..భారీగా బంగారం స్వాధీనం

జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి బంగారు నగలు, కేజీ వెండి, ఆరు బైక్‌లు, 7 వేలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

New Update
AP news: అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించిన పోలీసులు..భారీగా బంగారం స్వాధీనం

జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు ( police) అరెస్టు (arrested) చేశారు. ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే 20 తులాల బంగారు నగలు, 7 .5.లక్షల రూపాయలు విలువ చేసే కేజీ వెండి , ఆరు ద్విచక్ర వాహనాలు, 7500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ (District SP) పేర్కొన్నారు .

దొంగల ముఠా సభ్యులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District ) వ్యాప్తంగా ఇటీవల కాలంలో పలుచోరీలలో కీలక పాత్ర పోషించిన హిందూపురానికి చెందిన ఎస్ దాదా పీర్ (దాదు), కావడి మహేంద్ర, పరిగి మండలం పాత నర్సాపురం (Narsapuram) గ్రామానికి చెందిన నవీన్ కుమార్‌(Naveen Kumar)ల ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను సీసీఎస్ స్పెషల్ బ్రాంచ్, నల్లమడ సీఐ (CI )మూడు టీములు (three teams) బృందంగా ఏర్పడి దొంగల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 17.5 లక్షల విలువచేసే ప్రాపర్టీలను స్వాధీనం చేసుకొని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి (SP Madhav Reddy) ఎదుట హాజరు పరిచారు. జిల్లా ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: విశాఖ ఆర్కే బీచ్‌లో అంతులేని విషాదం.. కళ్లముందే విద్యార్ధుల గల్లంతు

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. తాళాలు వేసిన ఇళ్లనే ఎంచుకొని కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టు (Court)లో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో చోరీలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, చోరీలకు అడ్డుకట్ట వేసి తీరుతామని ఎస్పీ హెచ్చరించారు. చోరీలు జరుగుతున్న సమయంలో ప్రజలు సైతం జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అనుమానిత వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు పోలీసులకు తగు సమాచారం అందించి సహకరించాలని ఎస్పీ మాధవరెడ్డి కోరారు.

ఇది కూడా చదవండి: వేములవాడలో భయపెట్టిన ప్రేమజంట..అదుపులోకి తీసుకున్న పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు