Khairatabad Ganesh: ఈ ఏడాది సప్తముఖ మహశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు! ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నమూనా తాజాగా విడుదలైంది. శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసింది. ఈ ఏడాది ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. By Bhavana 03 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశ్ అంటే..రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం మొత్తానికి ఓ క్యూరియాసిటీ ఉంటుంది. ఈ ఏడాది ఎలాంటి థీమ్ తో స్వామి వారిని నిలబెడతారు..ఎన్ని అడుగులు నిలబెడతారు అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు నగరానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించిన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నమూనా తాజాగా విడుదలైంది. శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసింది. ఈ ఏడాది ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి అవుతున్నందున.. ఈ ఏడాది గణేశుడి విగ్రహాన్ని 70 అడుగుల ఎత్తులో మహాగణపతి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీ ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణేశుడికి కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడు ప్రతిమను కూడా ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నారు. Also read: డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ ఖరారు #hyderabad #ganesh #khairatabad #utsav-committee #70-feet-idol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి