Srilanka: టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి శ్రీలంకకు వెళ్లాలంటే వీసా అవసరం లేదు.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో సహా ఏడు దేశాలకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వనుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంటుందని చెప్పారు. By B Aravind 24 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి శ్రీలంకలో ఇటీవల ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ దేశానికి ఆదాయం వచ్చేది ముఖ్యంగా పర్యాటక రంగం నుంచే. అయితే పర్యటకాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌పాటుగా మరో ఏడు దేశాలకు చెందిన పర్యాటకులకు వీసా లేకుండానే టూరిస్టు ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇండియా, చైనా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, రష్యా, మలేషియా దేశాలకు ఇది వర్తించనుంది. ఈ మేరకు శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంటుందని చెప్పారు. Also Read: మణిపూర్ హింసకాండలో వాళ్ల ప్రమేయమే ఉందా: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ద్వీప దేశమైనంటువంటి శ్రీలంకను చూసేందుకు చాలా దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఆ దేశానికి వీదేశీ మారకం ఈ పర్యాటక రంగం నుంచే వస్తుంది. అయితే ఇటీవల కరోనా వైరస్ రావడం.. రాజకీయంగా, ఆర్థికంగా సంక్షోభం తలెత్తడంతో పర్యాటకుల రాకా చాలా వరకు తగ్గిపోయింది. అందుకే తమ దేశ పర్యాటక రంగానికి మళ్లీ ఊపిరిపోయాలని నిర్ణయించింది శ్రీలంక. అందుకే 2023 ఏడాదికి 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉచిత విసా నిర్ణయాన్ని తీసుకుంది. వాస్తవానికి గత కేబినెట్ సమావేశంలోనే ఈ అంశం తెరమీదకు వచ్చింది. ముందుగా కేవలం 5 దేశాలకు మాత్రమే ఫ్రీ ట్రావెల్ వీసా అనుమతి ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని 7కు పెంచుతూ తాజాగా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. #srilanka #tourists #tourism #srilanka-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి