Sreeleela : బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

New Update
Sreeleela : బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్!

Actress Sreeleela Bollywood Entry : సౌత్ హీరోయిన్లంతా ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ హీరోయిన్స్ కి నార్త్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే సమంత, నయనతార, శృతి హాసన్ రష్మిక మందన లాంటి స్టార్స్ హీరోయిన్స్ బాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోగా.. వీళ్ళ తర్వాత సాయి పల్లవి, కీర్తి సురేష్, సంయుక్త మీనన్ ఇప్పటికే హిందీ సినిమాలు సైన్ చేశారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో మన టాలీవడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కూడా చేరిపోయింది. అతి త్వరలోనే ఈ హీరోయిన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుందట.

సైఫ్ అలీఖాన్ కొడుకుతో రొమాన్స్...

టాలీవుడ్ లో పెళ్లి సందD, ధమాకా సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీలీల ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. గత ఏడాది ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవీ సక్సెస్ కాలేదు. దీంతో ప్రస్తుతం తెలుగులో ఈ హీరోయిన్ కి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. రీసెంట్ తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందని అన్నారు కానీ దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Also Read : రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయిందంటున్నారు. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరిపారని, శ్రీలీల కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు