Telangana : తనికెళ్లకు ఎస్ఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ రచయిత, దర్శకుడు, నటుడు తనికెళ్ళ భరణికి హన్మకొండలోని ఎస్.ఆర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 3న వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో దీనిని బహూకరించనుంది. By Manogna alamuru 26 Jul 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి Doctorate To Tanikella Bharani : బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ల భరణి (Tanikella Bharani) తన విలక్షణ నటనతో ప్రేక్షకులకు, రచయితగా పాఠకులకు ఎంతగానో దగ్గరైన విషయం తెలిసిందే. నటుడిగా, దర్శకుడిగా, కథకుడిగా ఆయన విలక్షణ శైలికి ఎందరో అభిమానులు ఉన్నారు. దాదాపు 800 సినిమాలకు పైగా నటించి, మెప్పించిన తనికెళ్ల భరణిని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రతిష్ఠాత్మక పురస్కారం నంది అవార్డును ఐదు సార్లు ఆయన అందుకున్నారు. ఇప్పుడు తెలుగువారి అభిమాన నటుడు తనికెళ్లకు హన్మకొండలోని ఎస్.ఆర్ యూనివర్శిటి (SR University) గౌరవ డాక్టరేట్‌ను ప్రకటిచింది. ఆగస్ట్ 3న వరంగల్ (Warangal) లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో ప్రధానం చేయనున్నట్టు ప్రకటనలో తెలిపింది. భరణికి ఇదే మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ కావడం విశేషం. 52 సినిమాలకు మాటలను అందించి రచయితగా తనికెళ్ళ భరణి అనేక విజయాలను అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘సముద్రం’ సినిమాకు ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్ నటునిగా, ‘గ్రహణం’తో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకు గాను ఉత్తమ రచయిత మరియు ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారాయన. ఇక ఆయనలోని ఆధ్యాత్మికత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘నాలోన శివుడు కలడు’ అంటూ ఆయన రచించిన ఆల్బమ్ ఇప్పటికీ, ఎప్పటికీ శివుని ఆలయాలలో మారుమోగుతూనే ఉంటుంది. Also Read:Hyderabad: అంధ బాలికపై అత్యాచారం..హైదరాబాద్‌లో దారుణం #warangal #tanikella-bharani #doctorate #sr-university మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి