Ashok Sharma : ఐపీఎల్ 2026లో సంచలనం.. 154.2 కిలోమీటర్ల వేగంతో బాల్ .. ఎవరీ అశోక్ శర్మ!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్‌కు చెందిన యువ పేసర్ అశోక్ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ఈ 23 ఏళ్ల కుర్రాడు

New Update
Ashok Sharma

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్‌కు చెందిన యువ పేసర్ అశోక్ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ఈ 23 ఏళ్ల కుర్రాడు, ఏకంగా 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సీజన్‌లో అన్రిచ్ నోర్ట్జే రికార్డును అధిగమించి, అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా అశోక్ నిలిచాడు. 16వ ఓవర్ చివరి బంతికి ఈ మైలురాయిని అందుకున్న అతను, అదే ఓవర్లో అంతకుముందు 150.7 కి.మీ వేగంతో మరో బంతిని వేసి తన సత్తా చాటాడు.

రెండు వైపులా స్వింగ్ చేయడంలో

రాజస్థాన్‌కు చెందిన అశోక్ శర్మ తొలినాళ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో నెట్ బౌలర్‌గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఇతనికి మంచి పట్టు ఉంది. 2022 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని ₹55 లక్షలకు కొనుగోలు చేయగా, 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు. ఇక 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా ₹90 లక్షలు వెచ్చించి అశోక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టిన ఈ యువ స్పీడ్‌స్టర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ మంచి రికార్డును కలిగి ఉన్నాడు.

గుజరాత్ బౌలర్లపై

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 55), వైభవ్ సూర్యవంశీ (18 బంతుల్లో 31) అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, ధ్రువ్ జురెల్ 42 బంతుల్లో 75 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడ రెండు వికెట్లు తీశాడు. అశోక్ శర్మ వేగంతో ఆకట్టుకున్నా, రాజస్థాన్ బ్యాటర్ల ధాటికి గుజరాత్ భారీ లక్ష్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

Advertisment
తాజా కథనాలు