స్టార్ బ్యాటర్ మరో రికార్డ్..27వేల పరుగుల ఖాతాలో సచిన్ తర్వాత..

టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ..రికార్డ్‌లు కొల్లగొట్టడంలో ఇతని తర్వాతే ఎవరైనా. తాజాగా విరాట్ మరో రికార్డ్‌ను సాధించాడు. సచిన్ తర్వాత 27వేల పరుగులను మార్కును  అందుకున్న రెండవ భారతీయుడిగా నిలిచాడు. 

New Update
cric

Virat Kohli: 

టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్‌ను సాధించాడు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 47 పరుగులు చేసి...అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఇండియాలో సచిన్ తర్వాత విరాట్ రెండవ బ్యాటర్‌‌గా  నిలిచాడు. టోటల్‌గా చూస్తే ఈ ఘనత సాఇంచిన నాల్గవ ఆటగాడిగా ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ 34, 357, కుమార సంగక్కర 28,016, రికీ పాంటింగ్ 27,483 పరుగులతో జాబితాలో ఉన్నారు. కోహ్లీ  27,012 పరుగులతో ఉన్నాడు. వేగంగా 27,000 పరుగులు మైలురాయిని అందుకున్న వారి  జాబితాలో కోహ్లీ సచిన్ కంటే ముందున్నాడు. సచిన్‌ 623 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. కోహ్లీ 594 ఇన్నింగ్స్‌ల్లోనే 27 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇతను  ఇప్పటివరకు టెస్టుల్లో 8918, వన్డేల్లో 13906,టీ20ల్లో 4188 రన్స్‌ చేశాడు.   

టీమ్ ఇండియా రికార్డ్‌ల మోత...

మరోవైపు బంగ్లాదేశ్‌తో టీమ్ ఇండియా రెండవ టెస్ట్‌లో నాల్గవరోజు ఆట ముగిసేసరికి మొత్తం 18 వికెట్లు నేలకూలాయి. మైదానం తడిగా ఉండటం వల్ల రెండు, మూడు రోజుల్లో ఆట సాధ్యం కాలేదు. ఎట్టకేలకు నాలుగో రోజు మ్యాచ్‌ సజావుగా సాగగా.. మొత్తం 18 వికెట్లు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. టెస్టు క్రికెట్‌లో వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన టీమ్‌గా రికార్డుల్లోకెక్కింది.

టెస్టు క్రికెట్ చరిత్రలో వేగంగా 50 పరుగులు చేసిన రికార్డు ఇదివరకు ఇంగ్లండ్‌ 26 బంతులు.. పేరిట ఉంది. ఇప్పుడు  భారత్‌.. బంగ్లాదేశ్‌పై 18 బంతుల్లోనే ఈ ఫీట్‌ సాధించింది. అలాగే టెస్టు క్రికెట్‌లో వేగంగా శతకం చేసిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది భారత్‌.  2023లో వెస్టిండీస్‌పై 12.2 ఓవర్లలో శతకం బాదిన టీమ్‌ఇండియా.. ఈ మ్యాచ్‌లో  10.1 ఓవర్లలోనే  వంద పరుగులు చేసింది. వీటితో పాటూ ఈ మ్యాచ్‌లోనే తన పేరిట ఉన్న 150 పరుగుల రికార్డును భారత టీమ్ మెరుగుపరుచుకుంది.  వెస్టిండీస్‌పై 21.1 ఓవర్లలో 150 పరుగులు చేసిన భారత్‌..  ప్రస్తుతం 18.2 ఓవర్లలోనే దాన్ని అధిగమించేసింది. ఇదే మ్యాచ్‌లో.. వేగంగా 200 పరుగులు చేసిన జట్టు రికార్డు కూడా టీమ్‌ఇండియాదే. 2017లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌లో ఆస్ట్రేలియా 28.1 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లాతో రెండో టెస్ట్‌లో భారత్‌ 24.4 ఓవర్లలోనే డబుల్‌ సెంచరీ సాధించి ఆస్ట్రేలియా మీద ఉన్న రికార్డ్ను చేరిపేసింది. ఇక  2022లో రావల్పిండి వేదికగా జరిగిన పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ 33.6 ఓవర్లలోనే 250 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. అయితే తాజాగా అత్యంత వేగంగా 30.4 ఓవర్లలోనే 250 పరుగులు చేసి కొత్త  రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
 

Also Read: Gujarath: 500నోట్లపై అనుపమ్ ఖేర్ బొమ్మ..1 కోటి 30 లక్షల టోకరా

Advertisment
Advertisment
తాజా కథనాలు