video viral : బ్యాట్ విరగ్గొట్టిన కోహ్లీ.. ఎందుకంటే? పుణె టెస్ట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ 40 బంతుల్లో 17 రన్స్ చేసి ఔటయ్యాడు. మిచెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కావడంతో రివ్యూకి వెళ్లినా ఫలితం లేదు. దీంతో కోహ్లీ నిరాశగా వెనుదిరిగి కోపంతో బ్యాట్ విరగ్గొటిన వీడియో వైరల్ అవుతోంది. By Vijaya Nimma 27 Oct 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update Virat Kohli షేర్ చేయండి Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఔట్ కావడంతో సహనం కోల్పోయాడు. కోపంతో బ్యాట్ విరగ్గొటిన వీడియో వైరల్ అవుతోంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ భారత్ తరఫున నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 40 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. కోహ్లీ రివ్యూకి వెళ్లినా అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ నిరాశగా వెనుదిరిగాడు. ఔట్ అయిన తర్వాత నిరాశతో పెవిలియన్‌కు వెళ్లే సమయంలో దారిలో ఉన్న ఐస్ కంటైనర్‌ను బ్యాట్‌తో గట్టిగా కొడుతూ వెళ్లాడు. ఓటమితో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోకుండా.. రోహిత్, గిల్‌లు తొందరగానే ఔట్ అవడంతో కోహ్లీపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. యశస్వి జైస్వాల్ (77)తో కలిసి మూడో వికెట్‌కు కోహ్లీ 31 పరుగులు జోడించాడు. అయితే శుభారంభాన్ని పెద్ద స్కోరుగా మార్చడంలో మాత్రం విఫలమయ్యాడు. 359 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 60.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటై 113 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పూణెలో ఓటమితో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోకుండా 12 ఏళ్లుగా సాగుతున్న భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. pic.twitter.com/fV6p1hpZdh — Drizzyat12Kennyat8 (@45kennyat7PM) October 26, 2024 Virat was totally disappointed with the decision of Umpire Decision 🥲💔- Can't see Virat like this! 🥺💔 pic.twitter.com/S31BA5TuVM — Virat Kohli Fan Club (@Trend_VKohli) October 26, 2024 భారతదేశంలో తొలిసారి న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. తొలిసారిగా నవంబర్ 1955లో టెస్టు సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్‌కు పరాభవం ఎదురైంది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌కు ముందు భారత గడ్డపై కివీస్ కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది. మొదటి రెండు టెస్టుల్లో నెగ్గిన న్యూజిలాండ్ మూడో టెస్టులో కూడా గెలిచి భారత జట్టును వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇది కూడా చదవండి: దీపావళి రోజు ఇంటిని ఇలా సువాసనతో నింపండి #virat-kohli మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి