/rtv/media/media_files/2026/05/31/vaibhav-2026-05-31-09-03-44.jpg)
క్రికెట్‌లో టాలెంట్ ఉంటే చాలు.. డబ్బు, కీర్తి తమంతట తామే వెతుక్కుంటూ వస్తాయి. బీహార్‌కు చెందిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విషయంలో ఇప్పుడు ఇదే నిజమవుతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో తన సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచస్థాయి బౌలర్లను వణికించిన ఈ బుడతడు.. ఏకంగా 240కి పైగా స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేసి ఈ సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దాంతో రాత్రికి రాత్రే ఫ్యాన్స్, క్రికెట్ నిపుణుల ఫేవరెట్ క్రికెటర్‌గా మారిపోయాడు.
ఈ క్రేజ్‌తో వైభవ్ బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. 'క్రిక్ బ్లాగర్' నివేదిక ప్రకారం.. ప్రస్తుతం వైభవ్ తన బ్యాట్ స్పాన్సర్‌షిప్ ద్వారా ఏడాదికి రూ. 50 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే, మంచి ఆఫర్ వస్తే ఈ ఒప్పందం నుండి తప్పుకునే అవకాశం అతనికి ఉంది. ఇప్పుడు అతని పాత అగ్రిమెంట్ ముగింపు దశకు రావడంతో.. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, ముఖ్యంగా పెద్ద పెద్ద టైర్ బ్రాండ్లు అతని బ్యాట్‌పై తమ లోగో వేయించుకోవడానికి క్యూ కడుతున్నాయి.
బ్లాంక్ చెక్ కూడా ఆఫర్
వైభవ్‌కు ఏకంగా ఏడాదికి రూ. 12 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక ప్రముఖ కంపెనీ అయితే అతను అడిగినంత ఇవ్వడానికి ఏకంగా బ్లాంక్ చెక్ కూడా ఆఫర్ చేసిందట. ఈ డీల్ గనుక ఓకే అయితే, క్రికెట్ స్పాన్సర్‌షిప్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అవుతుంది. ఒక చిన్న వయసు ఆటగాడు ఇంత పెద్ద కమర్షియల్ పవర్‌హౌస్‌గా మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా బ్యాట్ తయారు చేసే కంపెనీలు గరిష్టంగా రూ. 5 కోట్ల వరకు మాత్రమే ఇస్తాయని, కానీ ఎంఆర్‌ఎఫ్ (MRF), సియట్ (CEAT) వంటి పెద్ద టైర్ కంపెనీలు మాత్రమే ఇలాంటి భారీ డీల్స్ ఇస్తుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న రిషభ్ పంత్‌కు ఏడాదికి 8 కోట్లు వస్తున్నప్పుడు, ఐపీఎల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వైభవ్‌కు ఈ రేంజ్ ఆఫర్ రావడం పెద్ద వింతేమీ కాదని ఇండస్ట్రీ టాక్. కొంతమంది నిపుణులు ఇది కాస్త ఎక్కువ మొత్తమే అని అంటున్నప్పటికీ, ఈ బుడతడిపై కోట్లు కురిపించడానికి కంపెనీలు మాత్రం గట్టిగా లైన్ కట్టాయి.
Follow Us