Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో సంచలనం.. వైభవ్ సూర్యవంశీ హిస్టరీ!

IPL 2026 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న కేవలం 15 ఏళ్ల బిహార్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచం అబ్బురపడే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

New Update
vaibhav

IPL 2026 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న కేవలం 15 ఏళ్ల బిహార్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచం అబ్బురపడే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో 700 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి అన్‌క్యాప్డ్ (ఇంతవరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని) ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

చండీగఢ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్ 700 పరుగుల మార్క్‌ను దాటడానికి 20 పరుగులు కావాల్సి ఉండగా.. గుజరాత్ బౌలర్ కగిసో రబాడ వేసిన నాల్గో ఓవర్ రెండో బంతిని ఫోర్‌గా మలిచి అత్యంత స్టైలిష్‌గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. గతంలో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఒకే సీజన్లో 600 పరుగుల మార్క్‌ను దాటినప్పటికీ.. ఏకంగా 700 పరుగుల రికార్డు బారియర్‌ను బద్దలు కొట్టిన ఘనత మాత్రం కేవలం ఈ 15 ఏళ్ల వండర్ కిడ్‌కే దక్కింది.

జట్లు ఇవే!  

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యష్ రాజ్ పుంజా. (ఇంపాక్ట్ సబ్స్: శుభమ్ దూబే, సుశాంత్ మిశ్రా, అమన్ రావు పేరాల, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే).

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్. (ఇంపాక్ట్ సబ్స్: రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుశాగ్ర, అర్షద్ ఖాన్).

Advertisment
తాజా కథనాలు