ఈ విజయాన్ని ఊహించలేదని..అందుకే గెలచిన తర్వాత భావోద్వేగానికి లోనై ఏడ్చేశానని చెప్పాడు గుకేశ్ ప్రపంచ ఛెస్ ఛాంపియన్ తన పదేళ్ళ కల అని తెలిపాడు. ఈ క్షణం కోసం తాను దశాబ్దకాలంగా కలలు కన్నానని, అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఇది నా ఒక్క కలే కాదు నా తల్లిదండ్రులది కూడా అని అంటున్నాడు గుకేశ్. నాంటే వారే ఎక్కువగా దీని కోసం తపించారని చెప్పాడు. వారి ప్రోత్సాహం ఎనలేనిది. నా దృష్టిలో డింగ్ లిరెన్ నిజమైన ప్రపంచ ఛాంపియన్. అతడి ఓటమి బాధగా ఉంది. డింగ్, అతడి బృందానికి ధన్యవాదాలు. విజయం సాధిస్తానని ఊహించలేదు. కానీ, అవకాశం రావడంతో పావులు కదిపి విజయం దిశగా అడుగులు వేశానని చెప్పాడు. ఇప్పుడు ఇది నేను గెలుచుకున్నా ఉత్తమ ఛెస్ ప్లేయర్ మాత్రం మాగ్నస్ కార్ల్‌సన్‌నే అంటూ అతని మీద తన ప్రేమను చాటుకున్నాడు గుకేశ్.
Also Read : వామ్మో.. చెస్ ఛాంపియన్ గుకెశ్‌కు అన్నికోట్ల ప్రైజ్‌మనీయా !
దేశం గర్విస్తోంది..
దేశాన్ని గర్వపడేలా గుకేశ్ చేశాడని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజేతగా నిలిచినందుకు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : ధరణి సేవలు బంద్
ప్రధాని మోదీ..
గుకేశ్ విజయం ఒక అద్భుతం. అతని ప్రతిభ, కృషి, సంకల్పం ఫలితమే ఈరోజు అతన్ని ప్రపంచ విజేతగా నిలబెట్టిందని ప్రధాని మోదీ అన్నారు. చెస్ చరిత్రలో గుకేశ్ పేరును సుస్థిరం చేయడమే కాకుండా లక్షలాది మంది యువతకు గొప్ప కలలు కనేందుకు ఈ గెలుపు ప్రేరణగా నిలుస్తుంది అని పొగిడారు.
Also Read : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది! ఏమన్నారంటే?
విశ్వనాథ్ ఆనంద్..
చెస్‌కు, భారత్‌కు, డబ్ల్యూసీఏకు, తనకూ ఇది గర్వించదగ్గ క్షణమని అన్నారు భారత ఛెస్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్. గుకేశ్ విషయంలో తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు.
Also Read: Chess: యంగ్ తరంగ్ గుకేశ్ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం