Cricket: అమ్మాయిలు అదిరిపోయే ఆరంభం ఇస్తారా.. టీ20 మహిళల ప్రపంచ కప్ లో మొదటి పోరుకు సిద్ధమైంది భారత అమ్మాయిల జట్టు. ఈసారి ఎలా అయినా కప్పు గెలుచుకుని రావాలనే పట్టుదలతో అడుగులు వేస్తోంది. ఈరోజు న్యూజిలాండ్‌తో తమ ఫస్ట్ మ్యాచ్ ను ఆడనుంది టీమ్ ఇండియా. By Manogna alamuru 04 Oct 2024 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి T20 World Cup: సమరానికి సిద్ధమైంది టీ ఇండియా అమ్మాయిల జట్టు. టీ20 ప్రపంచ కప్ లో తొలి పోరుకు సమయం వచ్చింది. దుబాయ్‌లో జరుగుతున్న ఈ వరల్డ్‌కప్‌లో హర్మన్‌ప్రీత్ సేన.. గ్రూప్-ఎ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటోంది. ఈరోజు రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ ఏ లో అన్ని జట్లూ బలంగా ఉన్నాయి. దీంతో టీమ్ ఇండియా ఏ మ్యాచ్‌నూ తేలికగా తీసుకునే స్థితిలో లేదు. గ్రూప్ మ్యాచ్ లలో క్కువగా గెలవకపతే సెమీస్‌కు దారులు మూసుకుపోతాయి. గ్రూప్ ఏలోనే ఆస్ట్రేలయా జట్టు కూడాఉంది. అత్యంత బలమైన జట్టుల్లో ఇదొకటి. ఇది కచ్చింతగా సెమీకు చేరుతుంది ఇక రెండవ జట్టుగా ప్రధానగా భారత్, న్యూజిలాండులకే ఛాన్స్ ఉంది. ఈ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇందులో గెలిచే జట్టుకే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి భారత జట్టు తొలి పోరులో సత్తా చాటి శుభారంభం చేయడం కీలకం. ఇక హర్మన్ ప్రీత్ జట్టు విషయానికి వస్తే...ప్రస్తుతానికి ఈ టీమ్ మంచి ఫామ్‌లో ఉంది వార్మప్ రెండు మ్యాచ్‌లలోనూ విజం సాధించి కాన్ఫిడెంట్‌గా ఉంది. అయితే బ్యాటర్లు కొంచెం వీక్‌గా ఉన్నారు. టాప్-3 బ్యాటర్లు స్మృతిమంధాన, షెఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్ ల మీదే మొత్తం భారం ఉంది. ఈ త్రయం కచ్చితంగా కివీస్‌పై రాణించాల్సిందే. మరోవైపు జెమీమా చక్కటి ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. మిడిలార్డర్లో రిచా ఘోష్ కీలకం. ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపు ఇవ్వడంలో ఆమె పాత్ర కీలకం. దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్‌ల నుంచి జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసే సత్తా ఉన్న ప్లేయర్లు. వీళ్లిద్దరూ బంతితో మంచి ఫామ్‌లో ఉన్నారు. దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో దీప్తితో పాటు ఆశ శోభన, రాధ యాదవ్ ఎలా రాణిస్తారన్నది మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది. కానీ ఇంతకు ముందుటీమ్ ఇండియా, న్యూజిలాండ్‌తో ఆడిన టీ20 మ్యాచ్‌లను చూస్తే..భాత జట్టు చాలా కష్టపడాలనే అనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో భారత్ ఆడిన టీ20లు మొత్తం 13.. ఇందులో 4 మ్యాచ్‌లు నెగ్గి, 9 ఓడింది. తుది జట్లు (అంచనా)భారత్: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, ఆశ శోభన, శ్రేయాంక పాటిల్, రాధ యాదవ్, రేణుక సింగ్. న్యూజిలాండ్: సుజీ బేట్స్, సోఫీ డివైన్, అమేలియా కెర్, బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, లీగ్ కాస్పరెక్, ఫ్రాన్ జోనాస్, జెస్ కెర్, మోలీ పెన్‌ఫోల్డ్, హన్నా రోవ్, లియా తహుహు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి