Tata Steel Chess Masters: వరల్డ్ ఛాంపియన్‌ గుకేశ్‌పై.. ప్రజ్ఞానంద ఘన విజయం

ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌ను ఓడించి ప్రజ్ఞానంద టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. టైబ్రేకర్‌లో గుకేష్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ తర్వాత గుకేష్ ఆడిన మొదటి ఆటలోనే ఓటమి పాలయ్యాడు.

New Update
Tata Steel chess trophy

Tata Steel chess trophy Photograph: (Tata Steel chess trophy)

టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీని ప్రజ్ఞానంద సొంతం చేసుకున్నాడు. టైబ్రేకర్‌లో వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్‌ను ఓడించి ప్రజ్ఞానంద విజయం సాధించాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ తర్వాత గుకేష్ ఆడిన మొదటి ఆటలోనే ఓటమి పాలయ్యాడు. అర్జున్ ఇరిగైశి చేతిలో గుకేష్ ఓడిపోగా.. విన్సెంట్ చేతిలో ప్రజ్ఞానంద పరాజయం పాలయ్యారు. అయితే టైటిల్ కోసం ఇద్దరి మధ్య ట్రై బ్రేకర్ మ్యాచ్ జరిగింది. ఇందులో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో గుకేష్ ఉన్నాడు.

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

ఇది కూడా చూడండి: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!

రెండో భారత్ చెస్ ప్లేయర్‌గా..

టైటిల్ కోసం వీరిద్దరూ ట్రై బ్రేకర్‌లో తలపడగా.. ఇందులో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయ చెస్ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. ఇంతకు ముందు దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్నారు. ప్రజ్ఞానంద టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీ గెలవడంతో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అభినందనలు తెలిపారు. దేశంలో యువ గ్రాండ్ మాస్టర్స్ పెరుగుతున్నారన్నారు. 

ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు