IND vs USA : సూర్యకుమార్ వీరవిహారం..అమెరికా టార్గెట్ 162

టీ20 ప్రపంచకప్‌లో 2026 భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కీలక వికెట్లు పడుతున్నా ఒక్కడే పోరాడి జట్టుకు మంచి స్కోరు అందించాడు.

New Update
ind vs usa

టీ20 ప్రపంచకప్‌లో 2026 భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కీలక వికెట్లు పడుతున్నా ఒక్కడే పోరాడి జట్టుకు మంచి స్కోరు అందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

ఒక దశలో భారత్ 150 పరుగులు దాటడం కూడా కష్టమే అనిపించింది. కానీ, క్రీజులో ఉన్న సూర్యకుమార్ ఆఖరి ఓవర్లో శివమెత్తాడు. ఆ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. సూర్య మెరుపులతోనే భారత్ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచగలిగింది.

84 పరుగులతో టాప్ స్కోరర్‌గా

టీమిండియా బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో (నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇతని ఇన్నింగ్స్ వల్లే భారత్ 161 పరుగులు చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. తిలక్‌ వర్మ (25), ఇషాన్‌ కిషన్‌ (20) పరుగులు తీశారు. అమెరికా బౌలర్లలో షాడ్లీ 4, హర్మీత్‌ సింగ్‌ 2, అలీ ఖాన్‌, మొహ్సిన్‌ తలో వికెట్‌ తీశారు.

భారత్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యంతో అమెరికా ఇప్పుడు బరిలోకి దిగనుంది. భారత బౌలర్లు గనుక కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే ఈ స్కోరును కాపాడుకోవడం కష్టమేమీ కాదు. కానీ, అమెరికా బ్యాటర్లను తక్కువ అంచనా వేయలేం.

Advertisment
తాజా కథనాలు