/rtv/media/media_files/2026/06/06/surya-1-2026-06-06-17-36-11.jpg)
టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ అని కూడా చూడకుండా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్ గానే కాకుండా ఏకంగా జట్టు నుంచి పూర్తిగా పక్కన పెట్టడం క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. బ్యాటర్‌గా ఫామ్‌లో లేడనే కారణంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే, తనపై వేటు పడటంపై అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూర్యకుమార్ యాదవ్ అత్యంత హుందాగా స్పందించాడు. జట్టులో చోటు కోల్పోయినప్పటికీ, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పెద్ద మనసు చాటుకున్నాడు.
ఇంగ్లాండ్ టూర్‌కు ఎంపికైన టీమిండియా స్క్వాడ్ ఫోటోను షేర్ చేస్తూ సూర్య ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. "ఎంతో ప్రతిభ గల మన భారత జట్టు.. మున్ముందు రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టీమిండియా" అంటూ తన పాత సహచరులకు ధైర్యాన్ని ఇచ్చాడు. కెప్టెన్సీతో పాటు ప్లేస్‌ను కూడా కోల్పోయిన నెక్స్ట్ మినిట్‌లోనే జట్టుకు ఇలా మద్దతుగా నిలవడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇదే సమయంలో కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీని సూర్య ప్రత్యేకంగా అభినందించాడు. "భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి నువ్వు వంద శాతం అర్హుడివి తమ్ముడు. నీ క్రికెట్ ప్రయాణం మున్ముందు మరింత అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. దేశం తరఫున నువ్వు ఆడుతుంటే చూడాలని నేను కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఒక పక్క తనను జట్టు నుంచి తీసేసినా బాధపడకుండా, కొత్తగా వచ్చిన కుర్రాడిని ప్రోత్సహించడంతో సూర్యకుమార్ యాదవ్ రియల్ హీరో అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.
Follow Us