/rtv/media/media_files/2025/03/30/r3lAr3pBAaJVybvBuZ7G.jpg)
aniket varma
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 163 పరుగులకు చాపచుట్టేసింది. యువ ఆటగాడు అనికేత్ వర్మ ఒక్కడే పర్వాలేదనిపించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఆరు సిక్సులున్నాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ కు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓవర్ ఐదో బంతికి అభిషేక్(1) రనౌట్‌గా వెనుదిరిడాడు. ఆ తరువాత మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (2) కూడా వెనుదిరిగాడు. ఆ వెంటనే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్ఆడబోయిన నితీశ్‌కుమార్ రెడ్డి అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఇక కాస్త దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ (22) కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోనే కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అనికేత్ వర్మ దూకుడు
దీంతో 50 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును హెన్రిచ్ క్లాసెన్(32), అనికేత్ వర్మ(74) ఆదుకున్నారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. అయితే దూకుడుగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్.. మోహిత్ శర్మ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 115పరుగులకే హైదరాబాద్ సగం వికెట్లు కోల్పోయింది. ఒక పక్క వికెట్లు పడుతున్న అనికేత్ వర్మ మాత్రం దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సులతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకపడ్దాడు.16 ఓవర్లో కుల్‌దీప్‌యాదవ్ బౌలింగ్‌లో జెక్‌ఫ్రేజర్‌కు క్యాచ్ ఇచ్చి అనికేత్ వర్మ ఔటయ్యాడు. అనంతరం సన్‌రైజర్స్ పతనం షురూ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. 3.4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు స్టార్క్.
SRH: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ
DC: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, KL రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్
Also Read: Devara Japan Collections: జపాన్‌లో దేవర 'ఫెయిల్'..!! అందరి ముందు పరువు పోయిందిగా..
Rohit Sharma: నా క్యారెక్టర్ మారింది.. మైండ్‌సెట్ కాదు.. హిట్ మ్యాన్ సంచలన కామెంట్స్!
ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధంపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నాడు. అయితే పాత్రలు మారుతున్నా తన మైండ్‌సెట్ మాత్రం అసలే మారలేదన్నాడు.
Rohit Sharma interesting comments on Mumbai Indians
Rohit Sharma: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. ముంబైకి కెప్టెన్‌గా, మిడిలార్డర్, ఇప్పుడు ఓపెనర్ బ్యాటర్‌గా పరిస్థితులకు అనుగుణంగా తనను మార్చుకున్నట్లు తెలిపాడు. అయితే తన పాత్రలు మారుతూ వస్తున్నాయి కానీ.. తన మైండ్‌సెట్ మాత్రం అసలే మారలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఏం చేయాలో అదే చేస్తున్నా..
ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమ్ కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నా. ఇందులో ఏ మార్ప లేదు. మ్యాచ్ గెలవాలి. ట్రోఫీలు సొంతం చేసుకోవడంపైనే ఫోకస్ ఉంటుంది. ముంబై ఇండియన్స్‌కు ఇదంతా తెలుసు. కొన్నేళ్లుగా చాలా ట్రోఫీలను గెలుచుకున్నాం. విజేతలుగా నిలుస్తున్నాం. ముంబై ఇండియన్స్ కల్చర్ ఏంటో అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మా టార్గెట్ ఐపీఎల్ ట్రోఫీ సాధించడమే. మళ్లీ ముంబై ఇండియన్స్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే అన్నాడు.\
Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?
ఇక ముంబైలో విదేశీ క్రికెటర్ల గురించి మాట్లాడుతూ.. ట్రెంట్ బౌల్ట్‌కు ఎంతో అనుభవం ఉందన్నాడు.మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్ సారథి క్లాస్ ప్లేయర్ అని చెప్పాడు. విల్ జాక్స్, రీస్ టోప్లేతో జట్టులో వైవిధ్యం తీసుకొచ్చాం. రియాన్ రికెల్‌టన్ యువ క్రికెటర్ దూకుడుతోపాటు నిలకడగా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. భారత యువ ప్లేయర్లు ముంబైలో చాలామంది ఉన్నారు. వారితో కలిసి ఆడటం చాలా బాగుంటుంది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.
Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’
rohit-sharma | mumbai-indians | telugu-news
Loan waiver: లివర్ రూ.90 వేలు, కిడ్నీ రూ.75వేలు.. అప్పు తీర్చలేక అవయవాలు అమ్మకోడానికి రైతు
ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన శృతి.. అంతా వాళ్ళే చేశారంటూ కన్నీళ్లు!
Cabinet expansion : నల్లగొండ కాంగ్రెస్‌లో కోల్డ్ వార్.. విస్తరణకు మళ్లీ బ్రేక్
Shoes: వేసవిలో బూట్లు ధరించేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
High Court: HCUలో చెట్లు కొట్టొద్దు.. రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్!