/rtv/media/media_files/2025/03/26/tblIZt7TtyeTC6VmKgqj.jpg)
s-singh
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ కొట్టింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (74), బట్లర్ (54) పరుగులు చేశారు. చివర్లో రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో గుజరాత్ ఆటగాళ్లు తడబడ్డారు. చివరికి పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
శశాంక్ సింగ్ ఊచకోత
అయితే పంజాబ్ గెలవడంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (97*) ఎంత కీలక పాత్ర పోషించాడో.. శశాంక్ సింగ్ (44*) పాత్ర కూడా అంతే ఉంది. ఏడో బ్యాట్స్ మెన్ గా క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ మొదటినుంచే గుజరాత్ బౌలర్లపై ఎదరుదాడి చేశాడు. ఎడాపెడా బౌండరీలతో ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు. చివరి మూడు ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ కేవలం నాలుగు బంతులు ఆడగా మిగిలిన 14 బంతులు శంశాకే ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు, రెండు సిక్సలున్నాయి. సిరాజ్ వేసిన 20వ ఓవర్లో అయితే శశాంక్ ఏకంగా 5 ఫోర్లు బాదాడు. మరో బాల్ కూడా సిక్సు పోవాల్సిందే కానీ బై ఛాన్స్ మిస్ అయింది. దీంతో శశాంక్, శ్రేయస్ జోడీ 28 బంతుల్లోనే 81 పరుగులు జోడించింది.
ఒక పక్క శ్రేయాస్ అయ్యర్ సెంచరీకి దగ్గరగా ఉన్నప్పటికీ శశాంక్ మాత్రం తగ్గేదే లే అంటూ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతడు అడిన విధ్వంసరకర ఇన్నింగ్స్ పంజాబ్ జట్టును గెలిపించిదనే చెప్పాలి. ఇన్నింగ్స్ తర్వాత శశాంక్ శ్రేయస్ సెంచరీ మిస్ పై మాట్లాడుతూ.. ‘నా సెంచరీ కోసం చూడొద్దు. నువ్వు షాట్లు ఆడు’ అని శ్రేయస్ తనతో చెప్పారన్నారని వెల్లడించాడు.తన వ్యక్తిగత స్కోర్ కోసం కాకుండా జట్టు కోసం ఆలోచించాలని చెప్పాడని తెలిపాడు. కాగా శశాంక్ సింగ్ ను పంజాబ్ టీమ్ రూ.5.50 కోట్లకు కొనుగోలు చేసింది.
Also read : Mohammed Siraj : ఏందీ సిరాజ్ అన్న.. రూ.12 కోట్లు బొక్క.. 54 పరుగులిచ్చి!