Shaheen Afridi : అమెరికా-ఇరాన్ ఒప్పందంపై అఫ్రిది సంచలన పోస్ట్!

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షాహీన్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.

New Update
pak

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షాహీన్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌లను పొగుడుతూ అఫ్రిది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రపంచ శాంతి కోసం పాకిస్థాన్ నాయకత్వం వహించడం గర్వంగా ఉందంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

నెటిజన్లు ప్రశ్నల వర్షం 

ప్రధానంగా అఫ్రిది సహచర ఆటగాడు నసీమ్ షా ఉదంతాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి, నవాజ్‌ను విమర్శించినందుకు గాను నసీమ్ షాకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏకంగా రూ. 2 కోట్ల జరిమానా విధించింది. రాజకీయ వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా నిబంధనలు ఉల్లంఘించావని అప్పట్లో నసీమ్ షాపై చర్యలు తీసుకున్న పీసీబీ, ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయ పోస్ట్ పెట్టిన షాహీన్ అఫ్రిదిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై పీసీబీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

మరో వివాదంలో భారీ షాక్

మరోవైపు, షాహీన్ అఫ్రిదికి ఇప్పటికే మరో వివాదంలో భారీ షాక్ తగిలింది. టీమ్ హోటల్‌లో భద్రతా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై లాహోర్ ఖలందర్స్ జట్టు అఫ్రిదికి రూ.10 లక్షల జరిమానా విధించింది. హోటల్‌లో ఆటగాళ్లు ఉండే ఫ్లోర్‌లోకి నలుగురు అనధికార వ్యక్తులను తీసుకెళ్లారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విషయంలో తన తప్పేమీ లేదని, తన స్నేహితులకు సహాయం చేసే క్రమంలోనే ఇలా జరిగిందని అఫ్రిది తరపున మరో ఆటగాడు సికందర్ రజా వివరణ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు