Sanju Samson : సంజు శాంసన్  సరికొత్త చరిత్ర..ధోనీ రికార్డు బద్దలు!

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సంజు శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన శాంసన్ ..  నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

New Update
samjusamson

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన శాంసన్ ..  నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న 37వ మ్యాచ్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్‌లో 5000 పరుగుల మార్కును అందుకోవడానికి అతనికి కేవలం మూడు పరుగులు మాత్రమే అవసరం కాగా, ఒక ఫోర్ కొట్టడం ద్వారా శాంసన్ ఈ ఘనత సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగులు పూర్తి చేసిన 10వ ఆటగాడిగా నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా

అంతేకాకుండా, ఎదుర్కొన్న బంతుల పరంగా  ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన భారతీయ ఆటగాడిగా సంజు శాంసన్ రికార్డు సృష్టించాడు. శాంసన్ ఈ మైలురాయిని కేవలం 3555 బంతుల్లోనే చేరుకోవడం విశేషం. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ (3288 బంతులు), డేవిడ్ వార్నర్ (3554 బంతులు) మాత్రమే అతని కంటే ముందున్నారు. ఈ క్రమంలో కెఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా వంటి దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి శాంసన్ తన బ్యాటింగ్ సత్తాను చాటుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా అతను తన స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన వీరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి, నాలుగింటిలో ఓటమి పాలై ఆరు పాయింట్లతో కొనసాగుతున్నారు. తమ చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌పై గత మ్యాచ్‌లో సాధించిన విజయంతో మంచి ఊపు మీద ఉన్న సిఎస్‌కె, గుజరాత్ టైటాన్స్‌పై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు సమాన పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది.

Advertisment
తాజా కథనాలు