నాదల్ వీడ్కోలు.. కన్నీరు పెట్టుకున్న ఫెదరర్.. పోస్ట్ వైరల్! టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ వీడ్కోలుపై రోజర్ ఫెదరర్ ఎమోషనల్ అయ్యాడు. నాదల్ నీది గ్రేట్ జర్నీ. స్పెయిన్ తోపాటు టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు. నీలా నాకెవరు ఆటలో సవాల్ విసరలేదు. నీతో పంచుకున్న క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను' అంటూ లెటర్ రిలీజ్ చేశాడు. By srinivas 20 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌తో వీడ్కోలుపై రోజర్ ఫెదరర్ ఎమోషనల్ అయ్యాడు. నాదల్ కెరీర్‌లో చివరి టోర్నీ డేవిస్ కప్ ఫైనల్స్ కు ముందు నాదల్ తో తనకున్న బంధాన్ని పంచుకుంటూ ఫెదరరల్ లెటర్ రిలీజ్ చేశాడు. ఈ మేరకు నాదల్ ఆటను తాను మనస్ఫూర్తిగా ఆస్వాదించానని, తనలాగ ఇంకెవరు తనకు సవాల్ విసరలేదంటూ ప్రశంసలు కురిపించాడు. ఇది కూడా చదవండి: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి Vamos, @RafaelNadal! As you get ready to graduate from tennis, I’ve got a few things to share before I maybe get emotional. Let’s start with the obvious: you beat me—a lot. More than I managed to beat you. You challenged me in ways no one else could. On clay, it felt like I… — Roger Federer (@rogerfederer) November 19, 2024 నీ అడ్డాలో ఆడుతున్నట్లుండేది.. ‘నాదల్.. టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా నువ్వు నన్ను ఎన్నోసార్లు ఓడించావు. ఎంతలా అంటే.. నిన్ను నేను ఓడించినదానికంటే ఎక్కువ. నీ అంత నాకెవరూ సవాలు విసరలేదు. మట్టిలో ఆడుతున్నప్పుడు నీ అడ్డాలో ఆడుతున్నట్లుండేది. నేనెప్పుడూ ఊహించనిదాని కంటే మరింత కష్టపడేలా మార్చావు. నా రాకెట్ హెడ్ తీరును మార్చేలా చేశావు. నాపై 26-14తో ఆధిక్యం కలిగి ఉన్నావ్. గ్రాండ్‌స్లామ్స్‌లో ఈ రికార్డు 10-4. అయినా నాదల్‌తో తలపడడం వల్ల నేను ఆటను మరింతగా ఆస్వాదించా. నీది గ్రేట్ జర్నీ. 14 ఫ్రెంచ్ ఓపెన్‌లు గెలవడం చరిత్రాత్మకం. స్పెయిన్ మాత్రమే కాదు టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు' అంటూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ఇది కూడా చదవండి: TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు రోజర్ ఫెదరర్ 2022లో ఆటకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా లేవర్‌కప్‌లో డబుల్స్ ఆడిచ చివరి మ్యాచ్ భాగస్వామి నాదలే కావడం విశేషం. కాగా ఆ మ్యాచ్ తర్వాత వాళ్లిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేసిన రోజర్.. నువ్వు నా భాగస్వామిగా పక్కనుండడం గొప్ప అనుభూమతినిచ్చింది. నీతో కోర్టులో కన్నీళ్లనూ పంచుకోవడం నా కెరీర్‌లో మరిచిపోలేని గొప్ప సందర్భాల్లో ఒకటి అంటూ గతాన్ని తలచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు రోజర్. ఇది కూడా చదవండి: Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు! ఇది కూడా చదవండి: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు? #sports #rafael-nadal #nadal retirement #davis cup 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి