ఐపీఎల్ టోర్నీలో రిషబ్ పంత్ సంపాదన.. నిమిషానికి ఎంతో తెలుసా?

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 టోర్నీలో నిమిషానికి రూ.2678 సంపాదిస్తున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో అతన్ని లక్నో రూ.27 కోట్ల భారీ ధరకు పలికిన సంగతి తెలిసిందే. ఈ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు రిషబ్ పంతే.

New Update
Rishab pant

ఇటీవల ఐపీఎల్ మెగా వేలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ భారీ ధర పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు పంత్‌ను దక్కించుకుంది. అయితే ఈ డబ్బు అంతా కేవలం ఐపీఎల్ 2025 సీజన్‌కి మాత్రమే. ఇలా చూసుకుంటే మొత్తం 10 వారాలకు పంత్ రూ.27 కోట్లు సంపాదిస్తుండగా.. వారానికి రూ.2.70 కోట్లు, రోజుకి రూ.38,57,143 లక్షలు, గంటకి రూ.1,60,714 లక్షలు, నిమిషానికి రూ.2,678 అన్నమాట.  

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్‌ అయిన పెద్ద పాదం మార్గం!

పన్నుల ద్వారా కొంత..

ఇదిలా ఉండగా పంత్ రూ.27 కోట్లకి వేలంలో పలికిన కూడా అతని చేతికి మొత్తం రాదు. వివిధ పన్నుల కారణంగా తక్కువ మొత్తంలోనే అందుతుందని తెలుస్తోంది. పంత్ రూ.27 కోట్ల ఐపీఎల్ వేతనంపై 30 శాతం (రూ.8.06 కోట్లు) ఆదాయపు పన్ను వసూలు చేస్తారు. మిగిలేది రూ.18.94 కోట్లు మాత్రమే. ఇది మాత్రమే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాక్స్, సర్‌ఛార్జీ ఇలా కలుపుకుంటే మొత్తం రూ.11.48 కోట్లకుపైనే ప్రభుత్వ ఖజానాకు చేరుతాయి.

ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

దీంతో పంత్‌ చేతికి కేవలం రూ.15.52 కోట్లు మాత్రమే అందుతాయిని తెలుస్తోంది. అయితే ప్రయాణ ఖర్చులు, మేనేజర్ ఫీజు, ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లు, అకామిడేషన్, అకౌంటింగ్, ఇతర ఖర్చులను చూపిస్తే.. పంత్ చేతికి వచ్చే మొత్తం పెరిగే అవకాశం ఉంది. అలాగే సర్‌ఛార్జీలు లేకుండా కేవలం 30 శాతం టాక్స్ మాత్రమే కడితే.. పంత్‌ చేతికి రూ.18.94 కోట్లు వస్తాయి.

ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు!

ఇది కాకుండా ఐపీఎల్ సమయంలో పంత్‌ గాయపడితే.. అతడికి పూర్తి వేతనం అందిస్తారు. అయితే టోర్నీకి ముందే గాయపడి మ్యాచ్‌లు ఆడలేకపోతే పంత్‌కు బదులు వేరొక ప్లేయర్‌ను ఫ్రాంచైజీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. టోర్నీకి ముందు గాయపడిన ఆటగాళ్లకు ఎలాంటి పరిహారం అందించరు. 

ఇది కూడా చూడండి:  YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు