/rtv/media/media_files/2025/03/24/MwkHlO6waESoC1e89nqn.jpg)
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మొదటి మ్యాచ్ లోనే అట్టర్ ప్లాప్ అయ్యాడు. 6 బంతులు ఎదురుకున్న పంత్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. కుల్‌దీప్ వేసిన 13.4 ఓవర్‌కు డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఐపీఎల్ వేలంలో పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ అత్యధికంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ పంత్ ఫస్ట్ మ్యాచ్ లోనే అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. పంత్ 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విడిపోయే ముందు ఆ ఫ్రాంచైజీ తరపున 112 మ్యాచ్‌ల్లో 3, 200 పరుగులు సాధించాడు.
27 crore wasted on Pant#DCvsLSG pic.twitter.com/mxhfvnlmzM
— Maarwadi🚩🚩 (@Marwadi99) March 24, 2025