IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డ్ క్రియేట్ చేసిన రిషభ్ పంత్ కు సంబంధించి మరో సంచలన వార్త చర్చనీయాంశమైంది. రూ. 27 కోట్లకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా రిషబ్ పంత్ తమ జట్టుకు దక్కడంపై లఖ్ నవూ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సంతోషం వ్యక్తం చేశారు. వేలంలో తాము అనుసరించిన వ్యూహం అద్భుతమని, పంత్ ను అంత ఈజీగా వదులుకోనని చెప్పారు. అలాగే తమ జట్టులో నలుగురు కెప్టెన్లు ఉన్నారంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 24th Nov: Highest-paid player in IPL history25th Nov: Wraps up a historical win in PerthRishabh Pant, ladies and gentlemen 💙 pic.twitter.com/NTas9iijdy — Lucknow Super Giants (@LucknowIPL) November 25, 2024 పంత్ మరో 10-12 ఏళ్లు మా టీమ్‌లోనే.. "ఈ సారి వేలంలో పక్కా వ్యూహంతో ముందుకెళ్లాం. అదే మా సక్సెస్. పేస్ బౌలింగ్ విషయంలో విదేశీ ఆటగాళ్లకు బదులు భారత ప్లేయర్లను తీసుకున్నాం. బ్యాటింగ్‌లో విధ్వంసకర విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేశాం. రెండు విభాగాల్లోనూ జట్టు బలంగా ఉంది. మేము సంతోషంగా ఉన్నాం. మా టీమ్‌లో నలుగురు కెప్టెన్లు ఉన్నారు. రిషభ్ పంత్, మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్.. వీరంతా గెలుపు గుర్రాలే. పంత్ ఇంతకుముందే కంటే ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. 27 ఏళ్ల పంత్ మరో 10-12 ఏళ్లు మా టీమ్‌లోనే ఉండాలని కోరుకుంటున్నాం' అని చెప్పారు. దీంతో ఇప్పటికే పంత్ తో అగ్రిమెంట్ చేసుకున్నాడనే ఆంశం చర్చనీయాంశమైంది. Looking back, Jeddah indeed was special 🤩 pic.twitter.com/tZNb1J5dbv — Lucknow Super Giants (@LucknowIPL) December 2, 2024 ఇక నికోలస్ పూరన్‌ను రూ.21 కోట్లకు రిటైన్ చేసుకోగా.. మార్‌క్రమ్ రూ.2 కోట్లు, మిచెల్ మార్ష్ ను రూ.3.40 కోట్లకు దక్కించుకుంది లఖ్ నవూ. అయితే లఖ్‌నవూ కెప్టెన్ ఎవరనేది గొయెంకా వెల్లడించలేదు.