Cricket: రిషబ్ పంత్ సూపర్ సిక్స్..బిత్తరపోయిన ఫిలిప్స్

బెంగళూరులో కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో రిషబ్ పంత్ 99 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిక్స్‌లతో విజృంభించేశాడు. అందులో ఒక సిక్స్‌ను ఏంగా 107 మీటర్ల దూరం కొట్టేశాడు. 

New Update
cric

Rishab Panth: 

రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. కీవీస్ తో మొదటి టెస్ట్‌లో రెండో న్నింగ్స్‌లో ఆడిన తీరు చూసి వావ్ అంటున్నారు. సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 99 పరుగులు చేసిన పంత్ 5 సిక్స్‌లు  కొట్టాడు.  అసలు టెస్ట్ మ్యాచ్‌లను టీ20 స్టైల్‌లో ఆడాడు.  ఇందులో ఒక సిక్స్ తో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు పంత్. ఏకంగా 107 మీటర్ల సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 87 వ ఓవర్లో మూడో బంతిని సౌథీ ఓవర్ పిచ్ బాల్ వేశాడు. ఇదే అవకాశం గా భావించిన పంత్.. డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. బంతిని బలంగా బాదడంతో బాల్ స్టేడియం పై కప్పుకు తగిలింది. ఇదే సమయంలో అక్కడ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ నోరెళ్లబెట్టాడు. షాక్ అవుతూ అలా బంతిని చూస్తూ ఉండిపోయాడు. అసలు ఆడతాడో లేదో అనుకున్న సమయంలో కీలక పరుగులు చేడమే కాకుండా ఇలాంటి సిక్స్ కొట్టడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. గాయాన్ని లెక్క చేయకుడా పంత్ ఆడిన తీరు పోరాట స్ఫూర్తిని గుర్తు చేసింది. 

అయితే పంత్, సర్రాజ్ రెండో ఇన్నింగ్స్‌లో ఎంత బాగా ఆడినా...మొది ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు అందరూ ఘోరంగా విఫలమవడంతో...మ్యాచ్ గెలవడం కష్టంగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కావడంతో కివీస్ ముందు కేవలం 107 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. కీవీస్ కు ఇంకా ఒకరోజు ఉంది, వికెట్లు కూడా ఉన్నాయి. దీని ప్రకారం రేపు మొదటి సెషన్‌లో కీవీస్ మ్యాచ్ గెలిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే భారత జట్టు పరువు పోకుండా గౌరవంగా మ్యాచ్‌ను ఓడిపోయింది అని మాత్రం అనిపించుకుంటుంది అంతే.

Also Read: ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..మరికొన్నింటిపై తగ్గింపు

Advertisment
Advertisment
తాజా కథనాలు