/rtv/media/media_files/2025/03/29/oC6D8RZjbIFCZSIGNQGb.jpg)
jadeja 3000 runes
Ravindra Jadeja: ఐపీఎల్(IPL) చరిత్రలో 3వేల పరుగులు, 100+ వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆటగాడు రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(Royal Challengers Bangalore) జరిగిన మ్యాచులో ఈ ఘనతను అందుకున్నాడు. జడేజా ఐపీఎల్‌లో తన 243వ మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకోవడం విశేషం. 34 ఏళ్ల జడేజా.. తన ఐపీఎల్ కెరీర్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), (2008-09), కోచి టస్కర్స్ కేరళ (2011), చెన్నై (2012-15), గుజరాత్ లయన్స్(2016-17), చెన్నై (2018-ప్రస్తుతం) జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటివరకు 242 మ్యాచుల్లో 3,001 రన్స్ చేసి, 160 వికెట్లు పడగొట్టారు.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
Meet the first player in IPL history to score 3000+ runs and pick 100+ wickets!#fmplaynews #ravindrajadeja #RCBvsCSK #IPLHistory #CSK #Cricket #cricketlovers pic.twitter.com/0dyRZgXsWa
— FMPLAY247News (@FMPlay247news) March 29, 2025
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
జడేజా టీ20 లీగ్‌లో 30.76 బౌలింగ్ సగటు, 7.64 ఎకానమీ రేటుతో 160 వికెట్లు పడగొట్టాడు. చెన్నై తరపున133 వికెట్లు డ్వేన్ బ్రావో తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు. కాగా, బ్రావో 140 వికెట్లతో జట్టు వికెట్ చార్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. రవీంద్ర జడేజా తప్ప, ఐపీఎల్‌లో మరే ఇతర ఆటగాడు 3,000 పరుగులు, 100 వికెట్లు తీయలేకపోయాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును విరాట్ కోహ్లీ కలిగి ఉన్నాడు. 254 మ్యాచ్‌ల్లో 8,094 పరుగులు చేశాడు కోహ్లీ.
Also Read: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన బెంగళూరు.. చెన్నైని ఈజీగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన చెన్నై 146 పరుగులకే మాత్రమే చేసింది. దీంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రచిన్ ఒక్కడే 41 పరుగులతో రాణించారు. చివర్లో ధోనీ (30*) రెండు సిక్సర్లు కొట్టి అభిమానుల్లో జోష్ నింపాడు కానీ జట్టును గెలిపించలేకపోయాడు.