Rajat Patidar : వాటే క్యాచ్... చిరుతపులిలా పరుగెత్తి క్యాచ్ పట్టిన పటిదార్.. వీడియో చూశారా!

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మేగా ఫైనల్ మ్యాచ్ ముగిసింది.  గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచి వరుసగా రెండోసారి కప్ గెలుచుకుంది.

New Update
rajith

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మేగా ఫైనల్ మ్యాచ్ ముగిసింది.  గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచి వరుసగా రెండోసారి కప్ గెలుచుకుంది. ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న గుజరాత్ టాప్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచాలనే అతని వ్యూహం అద్భుతంగా పనిచేసింది. ఆర్‌సీబీ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన పదునైన బౌలింగ్‌తో టైటాన్స్ బ్యాటింగ్‌ వెన్నెముకను విరిచారు.

భారీ షాట్ ఆడటానికి

ఈ ఇన్నింగ్స్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన, మ్యాచ్‌ను శాసించే క్షణం మూడో ఓవర్‌లో ఎదురైంది. అప్పటికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసి, మంచి ఊపులో కనిపించింది. కెప్టెన్, స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టును భారీ స్కోరు వైపు నడిపిస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతిని గిల్ ఎదుర్కొన్నాడు. గంటకు 142 కిలోమీటర్ల వేగంతో, ఆఫ్-స్టంప్‌కు అవతలగా పడిన షార్ట్ లెంగ్త్ బంతిని గిల్ క్రీజులోనే ఉండి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే, బంతి బ్యాట్ పైభాగానికి తగలడంతో గాల్లోకి లేచి మిడ్-ఆఫ్ ప్రాంతంలో గాల్లో తేలింది.

ఆ సమయంలో మిడ్-ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్.. బంతి వెళ్తున్న దిశను గమనిస్తూ చిరుతపులిలా పరుగెత్తాడు. ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా, బంతిపైనే పూర్తి దృష్టి పెట్టి, పరుగెడుతూనే ఒక అద్భుతమైన సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో కేవలం 2 ఫోర్లతో 8 బంతుల్లో 10 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు. గిల్ అవుటైన తీరు చూసి అహ్మదాబాద్‌లోని స్థానిక గుజరాత్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు, స్టేడియం అంతా నిశ్శబ్దం అలుముకుంది. ఈ క్యాచ్ మొత్తం ఫైనల్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Advertisment
తాజా కథనాలు