/rtv/media/media_files/2026/03/28/salt-2026-03-28-21-22-39.jpg)
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ జట్ల మధ్య సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతోంది. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు వైపు నడిపిస్తున్నాడు. మ్యాచ్ 16వ ఓవర్లో ఇషాన్ కిషన్ ఒక బంతిని డీప్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా తరలించాడు. అది కచ్చితంగా ఫోర్ వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఫిల్ సాల్ట్ అసాధ్యమైన దానిని సుసాధ్యం చేశాడు.
ONE OF THE BEST CATCH IN IPL - PHIL SALT 🥶pic.twitter.com/WfRjiAjXRi
— Cricket Central (@CricketCentrl) March 28, 2026
బంతి వైపు వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లిన సాల్ట్, గాలిలోకి ఎగిరి తన కుడిచేత్తో ఒంటిచేత్తో ఆ బంతిని అందుకున్నాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌తో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ క్యాచ్ చూసిన స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. కామెంటేటర్లు సైతం ఇది ఈ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా నిలుస్తుందని ప్రశంసించారు. ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడంతో ఆర్‌సీబీ ఊపిరి పీల్చుకుంది. లేదంటే స్కోరు ఇంకా భారీగా ఉండేది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ జాకబ్ డఫీ కూడా 3 వికెట్లతో రాణించడం విశేషం.
Follow Us