పాక్ ఆటగాళ్లకు బిగ్ షాక్.. 75 శాతం ఫీజుల్లో కోత విధించిన బోర్డు!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టీ20 కప్‌లో పాల్గొనే దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా కుదించింది. ఒక్కో మ్యాచ్‌కు ఇప్పుడు రూ.3,110కు తగ్గించింది. అలాగే హోటళ్లలో బస, విమాన ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది.

New Update
pcb circket

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో నేషనల్ టీ20 కప్‌లో పాల్గొనే దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించింది.  గతంలో ఒక్కో మ్యాచ్‌కు 40 వేల పాకిస్థానీ రూపాయలు  అంటే భారత కరెన్సీలో రూ.12 వేలు ఇచ్చేదన్నమాట. అయితే ఇప్పుడు దానిని 10 వేలకు (భారత కరెన్సీలో రూ.3,110) తగ్గించింది.  మునుపటితో పోలిస్తే 75% తక్కువన్నమాట. అలాగే హోటళ్లలో బస, విమాన ప్రయాణాలపై కూడా బోర్డు ఆంక్షలు విధించింది.

ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు తగ్గించినప్పటికీ  పీసీబీ ఇతర రంగాలలో విలాసవంతంగా వ్యవహరిస్తోంది.  స్టేడియం పునరుద్ధరణలకు భారీగా ఖర్చు చేయడం, విదేశీ కోచ్‌లను నియమించడం, ఖరీదైన మెంటర్‌లను నియమించింది. బోర్డు ఇటీవల ఐదుగురు మాజీ క్రికెటర్లను - వకార్ యూనిస్, మిస్బా-ఉల్-హక్, సక్లైన్ ముష్తాక్, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్ - లను మెంటర్‌లుగా నియమించుకుంది , ఒక్కొక్కరికి నెలకు 5 మిలియన్లు అందుతోంది .

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విమర్శలు

అయితే మ్యాచ్ ఫీజులను తగ్గించడం దేశీయ ఆటగాళ్లను నిరుత్సాహపరుస్తుందని, అంతేకాకుండా యువత ప్రొఫెషనల్ క్రికెట్‌ను అనుసరించకుండా నిరుత్సాహపరుస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. కాగా  నేషనల్ టీ20 కప్ 2025 మార్చి 14 న ప్రారంభం కానుంది , ఇందులో ఫైసలాబాద్, లాహోర్, ముల్తాన్ అనే మూడు నగరాల్లో 39 మ్యాచ్‌లు జరుగుతాయి . ఫైనల్ మార్చి 27న ఫైసలాబాద్‌లో జరుగుతుంది .

Also read :  లిఫ్ట్‌లో మరో పసి ప్రాణం బలి.. మొన్న గంగారం, నేడు సురేందర్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు