/rtv/media/media_files/2025/03/21/wAgHyQKpouUVVhkZuL0q.jpg)
ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్రంగా నష్టపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పీసీబీ స్పందించింది. దాదాపు 10 మిలియన్ డాలర్ల లాభం వచ్చిందని అధికారికంగా వెల్లడించింది. 10 మిలియన్ డాలర్లు అంటే పాక్ రూపాయల్లో రూ. 280 కోట్లు ఆదాయం వచ్చిందన్న మాట. ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం, కరాచీ, లాహోర్, రావల్పిండిలోని స్టేడియంలను అప్‌గ్రేడ్ చేయడానికి భారీ మొత్తంలో ఖర్చు చేయడం ద్వారా బోర్డు ఆర్థికంగా నష్టపోయిందనే వార్తల నేపథ్యంలో పీసీబీ ప్రతినిధి ఆమిర్ మీర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావేద్ ముర్తాజా మీడియాకు వెల్లడించారు.
ఖర్చులను ఐసీసీ భరించింది
టోర్నమెంట్ కోసం అన్ని ఖర్చులను ఐసీసీ భరించిందని ఆయన తెలిపారు. టికెట్ల అమ్మకాలు, ఇతరాలతో పీసీబీకి రూ. 280 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆడిట్ తర్వాత ఐసీసీ నుంచి తమకు అదనంగా రూ.92 కోట్లు వస్తాయని భావిస్తున్నాం. అయితే తాము అనుకొన్న లక్ష్యాలను ఇప్పటికే అధిగమించామని ముర్తాజా మీడియాకు తెలిపారు. ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలోనే రూ.1.20 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా పాక్ మూడో ధనిక బోర్డుగా మారనుందని తెలిపారు.
Also read : అక్రమ సంబంధం వొద్దన్న తండ్రి.. గుండెలపై గుద్ది చంపిన కూతురు!
2023-24 ఆర్థిక సంవత్సరానికి పీసీబీ మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఇది 2024 సంవత్సరం కంటే 40% పెరుగుదల అని కూడా ఆయన పేర్కొన్నారు. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఆర్థిక లక్ష్యాలను సవరించడంలో కీలక పాత్ర పోషించారని, బోర్డు ఆర్థిక పనితీరును మెరుగుపరచడంలో చురుకైన పాత్ర పోషించారని ముర్తాజా తెలిపారు. ఇక ఆటగాళ్ల జీత భత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని పీసీబీ ఛైర్మన్ వెనక్కి తీసుకున్నారు. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెడతామని ప్రతిది పారదర్శకంగానే ఉంటుందని పీసీబీ చెప్పుకొచ్చింది.
Also Read : కర్ణాటకలో హనీట్రాప్ దుమారం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య