/rtv/media/media_files/2026/03/05/image-54-2026-03-05-19-19-15.png)
పాకిస్తాన్ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగిన ఈ జట్టు ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. ఇటీవల శ్రీలంకలో ఆ దేశ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు ముందు క్యాండీలోని ఒక హోటల్‌లో పాక్ ఆటగాడు ఓ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Pakistan Player Misbehave
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండటమే కాకుండా.. గ్రౌండ్ బయట కూడా వారి ప్రవర్తన పలు వివాదాలకు దారితీస్తోంది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకలోని క్యాండీలో ఉన్న ‘గోల్డెన్ క్రౌన్’ హోటల్‌లో పాక్ జట్టు బస చేసింది. అదే సమయంలో జట్టులోని ఒక అజ్ఞాత ఆటగాడు హోటల్‌లో పనిచేసే ఒక మహిళా హౌస్ కీపింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అదే సమయంలో సదరు ఆటగాడి ప్రవర్తనతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళ గట్టిగా అరుపులు అరుస్తూ, కేకలు వేసినట్లు సమాచారం. దీంతో ఆమె కేకలు విన్న హోటల్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను అతడి బారినుంచి కాపాడారు. ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న హోటల్ యాజమాన్యం ఆ ఆటగాడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పట్టుబట్టింది. అయితే పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ నవీద్ చీమా రంగంలోకి దిగి హోటల్ యాజమాన్యానికి క్షమాపణలు తెలిపింది. అనంతరం ఆ ఆటగాడికి భారీ ఫైన్ విధించింది.
అయితే ఆ సమయానికి జరిమానాతో సరిపెట్టినా.. పాక్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. తమ టీమ్ స్వదేశానికి చేరుకున్న తర్వాత సదరు ఆటగాడిని డిసిప్లినరీ కమిటీ ముందు హాజరుపరచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ నేరం రుజువైతే ఆ ప్లేయర్‌పై నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Follow Us