Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

నికోలస్ పూరన్ టీ20 క్రికెట్‌లో అత్యంత భయంకరమైన హిట్టర్ అని నిరూపించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడుతున్న ఈ వెస్టిండీస్ స్టార్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  అన్ని లీగ్ లో కలిపి అంటే 385 టీ20లలో  ఏకంగా 600 సిక్సలు బాదాడు.

New Update
nicholas pooran 600 sixes

 

నికోలస్ పూరన్ మరోసారి తాను టీ20 క్రికెట్‌లో అత్యంత భయంకరమైన హిట్టర్ అని నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడుతున్న ఈ వెస్టిండీస్ స్టార్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  అన్ని లీగ్ లో కలిపి అంటే 385 టీ20లలో  ఏకంగా 600 సిక్సలు బాదాడు. పూరన్ విధ్వంసం ఎలా సాగిదంటే 2024 నుంచి ఇప్పటివరకు 194 సిక్సులు బాదాడు. ఈ మైలురాయిని సాధించిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. 

2013లో టీ20 అరంగేట్రం చేసిన పూరన్, తన 385వ మ్యాచ్‌లో 600 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అతని ఖాతాలో 8,640 పరుగులు ఉన్నాయి. పూరన్ చేసిన 149 సిక్సర్లు వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లలో వచ్చాయి. విండీస్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, పూరన్ టీ20 క్రికెట్‌లో అనేక ఫ్రాంచైజీలకు ఆడాడు. అంతకంటే ముందు క్రిస్ గేల్, కీరాన్ పొలార్డ్ , ఆండ్రీ రస్సెల్ వంటి దిగ్గజాలున్నారు. క్రిస్ గేల్ 463 టీ20మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా..  కీరన్ పొలార్డ్ (908 సిక్సర్లు), ఆండ్రీ రస్సెల్ (733 సిక్సర్లు)తో తరువాతి జాబితాలో ఉన్నారు. 

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ళు:

1 - క్రిస్ గేల్: 1056 సిక్సర్లు

2 - కీరాన్ పొలార్డ్: 908 సిక్సర్లు

3 - ఆండ్రీ రస్సెల్: 733 సిక్సర్లు

4 - నికోలస్ పూరన్: 606 సిక్సర్లు*

5 - అలెక్స్ హేల్స్ : 552 సిక్సర్లు

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తో జరుగుతోన్న మ్యాచ్ లో నికోలస్ పూరన్ వీరవిహారం చేశాడు. 30 బంతుల్లోనే 75 పరుగులు బాదాడు.  ఇందులో  6 ఫోర్లు, 7 సిక్స్‌లున్నాయి. అతనికి తోడుగా మిచెల్ మార్ష్‌ 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్స్‌లు, 6 సిక్స్‌లున్నాయి. ఇద్దరు కలిసి 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  వీరిద్దరి స్పీడుకు లక్నో సూపర్ జెయింట్స్ 210 పరుగులు చేసింది. 

Also read :  AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!

Advertisment
Advertisment
Advertisment