IND vs NZ : భారత్ గడ్డపై 36 ఏళ్లుగా.. ఆ జట్టు విజయం కోసం ఎదురుచూపు

బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్‌కి ఈరోజు టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కివీస్ జట్టు గత 36 ఏళ్ల నుంచి భారత్ గడ్డపై ఒక్క విజయం సాధించలేదు. మరి ఈ సారైన న్యూజిలాండ్ భారత్ గడ్డపై విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

New Update
IND VS NZ

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈరోజు నుంచి భారత్-న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. దాదాపు12 ఏళ్ల తర్వాత ఈ వేదికపై భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. దీంతో పాటు న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌ల్లో 36 ఏళ్లుగా భారత్ గడ్డపై ఒక్క విజయం కూడా సాధించలేదు. మరి ఈ సిరీస్‌లో అయిన న్యూజిలాండ్ ఆ రికార్డును సమం చేస్తుందో లేదో చూడాలి. 2012లో భారత్‌తో న్యూజిలాండ్‌కి జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 2-0 తేడాతో సిరీస్‌ను గెలిచింది.

ఇది కూడా చూడండి: America-Ap: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురి మృతి!

చివరిగా వాంఖడే స్టేడియంలో..

ఆ టెస్ట్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోనీ, సురేశ్‌ రైనాలు ఆఫ్‌ సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ రెండో మ్యాచ్‌లో కివీస్ 248 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. టెస్ట్ మ్యాచ్‌ల్లో గత కొన్నేళ్ల నుంచి న్యూజిలాండ్ ప్రదర్శన పేలవంగా ఉంది. ముంబయిలో వాంఖడే స్టేడియంలో 1988లో కివీస్ భారత్‌పై చివరిసారిగా గెలిచింది. 

ఇది కూడా చూడండి: Ap Rains: తీవ్ర అల్పపీడనం..రేపు తీరం దాటనున్న వాయుగుండం!

మళ్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కివీస్ భారత్‌పై ఒక్క మ్యాచ్ గెలవలేదు. మొత్తం 18 టెస్టుల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్స్‌ టైటిల్‌‌ను 2021లో గెలిచిన న్యూజిలాండ్ ఆ విజయాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా ఓడిపోయింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్స్‌ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఆరో స్థానానికి పడిపోయింది. 

ఇది కూడా చూడండి:  మందుబాబులకు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు.. ధర ఎంతో తెలుసా!?

భారత్‌తో ఈరోజు నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే భారత గడ్డపై న్యూజిలాండ్ గెలిచిన.. మళ్లీ ఇంగ్లండ్‌తో తలపడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియ్స్‌లో ఫైనల్స్‌కి చేరాలంటే కివీస్ రెండు సిరీస్‌లో కూడా ఆకట్టుకునే ప్రదర్శన తప్పకుండా చేయాలి. భారత్‌కి న్యూజిలాండ్‌కి మధ్య ఇప్పటి వరకు 62 టెస్టులు జరగ్గా.. టీమ్‌ఇండియా 22 మ్యాచ్‌ల్లో, కివీస్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇందులో 27 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 

ఇది కూడా చూడండి: ఏపీలోని మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. రేపటి నుంచే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు