Nehal Vadoliya : విడాకులైన ఆ క్రికెటర్ అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్నాడు.. బాంబు పేల్చిన నటి!

ప్రముఖ నటి, మోడల్ నెహాల్ వదోలియా ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే గుజరాతీ నటుడు కరణ్ జోషి తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడంటూ ఆరోపణలు చేసిన నెహాల్, ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చింది.

New Update
modal

ప్రముఖ నటి, మోడల్ నెహాల్ వదోలియా ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే గుజరాతీ నటుడు కరణ్ జోషి తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడంటూ ఆరోపణలు చేసిన నెహాల్, ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చింది. ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఒక విడాకులైన క్రికెటర్ కూడా సోషల్ మీడియాలో తనకు ఫ్లర్టింగ్ మెసేజ్‌లు పంపాడంటూ సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ క్రికెటర్ తన ఇన్‌బాక్స్‌లోకి వచ్చి ఎలాంటి మెసేజ్‌లు పంపేవాడో కూడా ఆమె వివరంగా వెల్లడించింది.

అతను అంతగా పాపులర్ అయిన ఆటగాడేమీ కాదు కానీ రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు ఆడాడు, అలాగే అతనికి విడాకులు కూడా అయ్యాయని హింట్ ఇచ్చింది. ఆ క్రికెటర్ ఎలాంటి మెసేజ్‌లు పంపేవాడని ఓ ఇంటర్వ్యూలో  హోస్ట్ అడగగా.. తను సోషల్ మీడియాలో పెట్టే స్టేటస్‌లు, పోస్ట్‌లకు సదరు క్రికెటర్ తరచూ స్పందిస్తూ హాట్, బ్యూటిఫుల్, ప్రెట్టీ అంటూ కామెంట్లు పంపేవాడని నెహాల్ చెప్పుకొచ్చింది. 

యుజ్వేంద్ర చాహల్ భయ్యా

ఆ క్రికెటర్ గురించి మరింతగా మాట్లాడుతూ.. "నేను గనుక ఇప్పుడు అతనికి ఒక్క మెసేజ్ చేస్తే, అతను మళ్లీ నాతో మెసేజ్‌లు చేయడం మొదలుపెడతాడు.. కానీ నాకు అతనితో మాట్లాడటం అస్సలు ఇష్టం లేదు" అని నెహాల్ స్పష్టం చేసింది. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో చివరకు ఆ క్రికెటర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు ఆమె తెలిపింది. నెహాల్ చేసిన ఈ వ్యాఖ్యలతో నెటిజన్లు ఆ క్రికెటర్ ఎవరై ఉంటారా అని సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు. కొంతమంది షిమ్రాన్ హెట్మెయర్ లేదా తుషార్ దేశ్‌పాండే అయ్యుంటారని అంచనా వేస్తుండగా, మరికొందరు చాహల్ కూడా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోనే ఉన్నాడు కదా యుజ్వేంద్ర చాహల్ భయ్యా.. అది నువ్వేనా? అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఊహాగానాలు మొదలుపెట్టారు.

Advertisment
తాజా కథనాలు