/rtv/media/media_files/2025/03/26/YWdXUHYPXqPrKUYlTuCA.jpg)
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వీరవిహారం చేశాడు. 42 బంతుల్లో (97*) పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సులున్నాయి. అతనికి తోడుగా.. శశాంక్ సింగ్ (44*)ఉతికారేశాడు. ప్రియాంష్ ఆర్య(47), మార్కస్ స్టోయినిస్ (20), అజ్మతుల్లా ఒమర్జాయ్ (16) పరుగులు చేశారు. గ్లెన్ మాక్స్వెల్(0) ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగాడు.
Not my day — 0/54(4)
— DSP Mohammed Siraj (@SirajTheDSP) March 25, 2025
But this game is all about comebacks.
I’ve been here before, I’ll rise again.💪 #GTvsPBKS #IPL2025 #MohammedSiraj pic.twitter.com/3zczoYxfmJ
అయితే ఎన్నో అంచనాలతో గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్ మాత్రం అతి దారుణంగా నిరాశపరిచాడు. నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇందులో మొదటి మూడు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చిన సిరాజ్.. చివరి ఓవర్లో ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు. సిరాజ్ వేసిన 20 ఓవర్ లో పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ ప్రతి బాల్ ను బౌండరీ బాదాడు. అందులో కొద్దీగా మిస్ అయి అది టూడీగా వచ్చింది. లేదంటే అది సిక్సు పోయేది. మిగిలిన ఐదు బంతులను శశాంక్ సింగ్ ఫోర్లుగా మలిచాడు. మహమ్మద్ సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసింది.