తెలంగాణ డీఎస్పీగా ఇండియా స్టార్ క్రికెటర్.. ఎవరంటే!?

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అధికారికంగా బాధ్యతలు చేపట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను సాధించిన అసాధారణ విజయానికి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టును కేటాయించింది

New Update
Mohammed Siraj

మహమ్మద్ సిరాజ్.. ఈ పేరు గురించి క్రికెట్ ప్రియులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. రాకెట్ వేగంతో బంతిని విసిరి వికెట్లను విరగ్గొట్టే సత్తా కలిగిన పేస్ బౌలర్ సిరాజ్. అతడు బౌలింగ్ వేయడానికి వస్తున్నాడంటే.. క్రీజ్‌లో ఉన్న బ్యాటర్లకి ఒణుకుపుడుతుంది.

ఇది కూడా చదవండి: వామ్మో పిల్లలూ జాగ్రత్త.. బిస్కెట్‌లో ఐరన్ వైర్.. వీడియో చూశారా?

ఎన్నో మ్యాచ్‌ల్లో తన బౌలింగ్‌తో టీమిండియాను విజయపథంలో నడిపాడు. మ్యాచ్ చేజారిపోతుందనుకున్న సమయంలో తన చాకచక్య బౌలింగ్ టెక్నిక్‌తో భారత్‌ను గెలిపించాడు. జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజయానికి సహకరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్‌కు ఉద్యోగాన్ని ప్రకటించారు. 

డీజీపీకి రిపోర్ట్ చేసిన సిరాజ్

అంతర్జాతీయ క్రికెట్‌లో సైతం సిరాజ్ సాధించిన అసాధారణ విజయానికి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ప్రకటించింది.

ఇది కూడా చదవండి: విషాదం.. భర్త, ఇద్దరు కుమారుల మృతి.. ‘మీరు లేని జీవితం నాకొద్దు’

ఇందులో భాగంగానే మహమ్మద్ సిరీజ్ శుక్రవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి రిపోర్ట్ చేశాడు. సిరాజ్ తెలంగాణను గర్వించేలా చేయడమే కాకుండా జాతికి గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. అందుకే అతడికి ఈ బాధ్యత గొప్ప గౌరవం అని చెప్పాలి.

#mohammed-siraj
Advertisment
Advertisment
తాజా కథనాలు