/rtv/media/media_files/2024/11/21/bUVxCL3PphoadELmAODv.jpg)
IPL: ఐపీఎల్ మెగా వేలంపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కు మహ్మద్ షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మరో మూడు రోజుల్లో రెండు రోజులపాటు (నవంబర్ 24, 25 తేదీలు) సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా ఈ మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంజ్రేకర్.. భారత ఆటగాళ్ల గురించి ప్రస్తావిస్తూ షమీ భారీ ధరకు అమ్ముడుపోవడం కష్టమేనంటూ అనుమానం వ్యక్తం చేశాడు.
Mohammed Shami's Instagram story on Sanjay Manjrekar's statement about the price tag for IPL 2025 ⚡ pic.twitter.com/04fCmsoK7U
— Johns. (@CricCrazyJohns) November 21, 2024
ఫ్రాంచైజీలు సిద్ధంగా లేవు..
ఈ మేరకు మంజ్రేకర్ మాట్లాడుతూ.. ఈ ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగనుంది. సీనియర్ పేసర్ షమీ గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్నాడు. కాబట్టి అతడికి భారీ ధర దక్కకపోవచ్చు. గాయాల వల్ల సీజన్లకు అందుబాటులో లేకపోతే.. భారీ మొత్తం వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉండట్లేదు. అతడికి డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: అటవీశాఖలో విలువైన కార్లు మాయం.. నివేదిక కోరిన పవన్!
అయితే ఆయన కామెంట్స్ పై తాజాగా స్పందించిన షమీ.. ‘బాబాకి జయహో.. మీ ఫ్యూచర్ కోసం కొంచెం జ్ఞానం దాచుకోండి మంజ్రేకర్ జీ. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది’ అంటూ ఇన్‌స్టా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతోంది.