నిన్న కోలకత్తాతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలవలేదు కానీ...ఈ జట్టులో బౌలర్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్ జట్టు బౌలర్ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి ఐపీఎల్ లో వికెట్ తీసుకున్న తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. రైట్ హ్యాండర్ బ్యాటర్స్ కు అతను లెఫ్టర్మ్ ఆర్థోడాక్స్‌తో బౌలింగ్ చేశాడు. అదే విధంగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లకు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఇందులో మళ్ళీ వింతేమిటంటే..అతని బౌలింగ్ యాక్షన్ రెండు చేతులతో కూడా ఒకేలా ఉండడం. నిన్న జరిగిన మ్యాచ్ లో మెండిస్ ఒకే ఒక ఒవర్ వేసి నాలుగు పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
ఫ్లే ఆఫ్స్ ఆశలు లేనట్లేనా..
ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు విషయానికి వస్తే నిన్న కోలకత్తా చేతిలో ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఘోరంగా విఫలమైంది. అందరూ పెద్ద పెద్ద ప్లేయర్లు. భారీ అంచనాలు...కానీ ఏం లాభం..హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం మ్యాచ్ లు గెలవలేకపోతోంది. వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను తన ఖాతాలో వేసుకుంది. ఈరోజు కోలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ ఒక్కడే 33 పరుగుల టాప్ స్కోరర్ గా నిలిచాడు అంటే అర్ధం చేసుకోవచ్చు...ఆ జట్టులో బ్యాటర్లు ఎంత ఘోరంగా విఫలం అయ్యారో. మెండిస్ 20 బంతుల్లో 27 పరుగులు చేసాడు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్లకే టపాటపా పడిపోయారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనే ఈరోజు చేతులెత్తేసింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 3, వరుణ్ చక్రవర్తి 3, రస్సెల్ 2, హర్షిత్ రాణా, సునిల్ నరైన్ ఒక్కో వికెట్ తీశారు. మూడు మ్యాచ్ లు వరుసగా ఓడిపోవడంతో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్లే ఆఫ్స్ కు వెళ్ళడం సందేహమేనా అనుమానం వ్యక్తమవుతోంది.
today-latest-news-in-telugu | IPL 2025 | bowler
Also Read: USA: ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్