/rtv/media/media_files/2025/02/28/sfo1oqYyZ8nbwy6agIzv.jpg)
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలకు జోస్ బట్లర్ గుడ్ బై చెప్పాడు. దీంతో రేపు సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ అతనికి చివరిది కానుంది.
Jos Buttler resigns as England white-ball captain after Champions Trophy disaster.
— Savage SiyaRam (@SavageSiyaram) February 28, 2025
Saturday's match against South Africa will be his final match at the helm. pic.twitter.com/NlZwzWRnl9
ఆఫ్ఘనిస్తాన్ చేతిలో దారుణమైన ఓటమి
ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన బట్లర్ సేన, లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది. దీంతో జోస్ బట్లర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కెప్టెన్సీ నుంచి బట్లర్ తప్పుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో జట్టు ఓటిమి పాలు కావడంతో ఇంగ్లాండ్ టీమ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జో రూట్ 120 పరుగులు చేసినప్పటికీ, ఇంగ్లాండ్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌పై తమ 326 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక 317 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇయాన్ మోర్గాన్ నుంచి బాధ్యతలు
కాగా బట్లర్ కెప్టెన్సీలోనూ ఇటీవల భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీసుల్లోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది. ఇయాన్ మోర్గాన్ నుంచి 2022 జూన్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న బట్లర్ ఆ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ 44 వన్డే మ్యాచ్ లు ఆడగా, 18 విజయాలు, 25 ఓటములను చవిచూసింది. ఇక 51 టీ20ల్లో, అతను 26 విజయాలు, 22 ఓటములను చవిచూసింది. కాగా జోస్ బట్లర్ తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు కొత్త వైట్-బాల్ కెప్టెన్ ఎవరు అవుతారో ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : SLBC Tunnel : టన్నెల్‌లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం : కలెక్టర్ క్లారిటీ!