SRH vs DC : వాటే క్యాచ్... మైండ్ బ్లోయింగ్ అంతే!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అనికేత్ వర్మ కొట్టిన భారీ షాట్ ను డీప్ మిడ్-వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ అద్భుతంగా పట్టుకున్నాడు. గుర్క్ బౌండరీ దగ్గర ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి చక్కగా క్యాచ్ పట్టుకున్నాడు.  

New Update
catch

catch

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో ఆసక్తికర సన్నీవేశం చోటుచేసుకుంది.  ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అనికేత్ వర్మ కొట్టిన భారీ షాట్ ను డీప్ మిడ్-వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ అద్భుతంగా పట్టుకున్నాడు. గుర్క్ బౌండరీ దగ్గర ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి చక్కగా క్యాచ్ పట్టుకున్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దీంతో అనికేత్ వర్మ ఇన్నింగ్స్ అద్భుతమైన క్యాచ్ తో ముగిసింది. వర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ కు తొలి ఓవర్‌ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓవర్ ఐదో బంతికి అభిషేక్‌(1) రనౌట్‌గా వెనుదిరిడాడు. ఆ తరువాత మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో  స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ కిషన్‌ (2) కూడా వెనుదిరిగాడు.  ఆ వెంటనే మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో భారీ షాట్ఆడబోయిన నితీశ్‌కుమార్‌ రెడ్డి అక్షర్‌ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. ఇక కాస్త దూకుడుగా ఆడుతున్న ట్రావిస్‌ హెడ్‌ (22) కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోనే కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనికేత్ వర్మ దూకుడు

దీంతో 50 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును హెన్రిచ్ క్లాసెన్(32), అనికేత్ వర్మ(74) ఆదుకున్నారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. అయితే దూకుడుగా ఆడుతున్న హెన్రిచ్‌ క్లాసెన్‌..  మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 115పరుగులకే హైదరాబాద్ సగం వికెట్లు కోల్పోయింది. ఒక పక్క వికెట్లు పడుతున్న అనికేత్ వర్మ  మాత్రం దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సులతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకపడ్దాడు.16 ఓవర్లో కుల్‌దీప్‌యాదవ్‌ బౌలింగ్‌లో జెక్‌ఫ్రేజర్‌కు క్యాచ్ ఇచ్చి అనికేత్‌ వర్మ ఔటయ్యాడు. అనంతరం సన్‌రైజర్స్ పతనం షురూ అయింది.  ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్  మిచెల్‌ స్టార్క్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు.  3.4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు స్టార్క్‌.  

Also Read : Aarogyasri card : ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? అయితే ఈ శుభవార్త మీ కోసమే

 

Advertisment
Advertisment
Advertisment