/rtv/media/media_files/2026/04/04/iyer-2026-04-04-09-45-55.jpg)
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది. అయితే, ఈ విజయానందం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు పూర్తిస్థాయిలో దక్కలేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో అయ్యర్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది.
గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై నెమ్మదిగా ఓవర్లు వేసినందుకు 12 లక్షల జరిమానా పడగా, ఈసారి అదే తప్పు రిపీట్ కావడంతో జరిమానా రెట్టింపు అయ్యింది. ఈసారి అయ్యర్‌కు 24 లక్షల రూపాయల భారీ ఫైన్ విధించారు. కేవలం కెప్టెన్‌కే కాకుండా, జట్టులోని ఇతర ఆటగాళ్లకు (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. తదుపరి మ్యాచ్‌లో కూడా ఇదే తప్పు జరిగితే అయ్యర్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడే ప్రమాదం ఉంది.
5 వికెట్ల నష్టానికి 209 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (73 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, రుతురాజ్ గైక్వాడ్ (28), సర్ఫరాజ్ ఖాన్ (32), శివం దూబే (45*) మెరుపులు మెరిపించారు.
అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుండి జట్టును నడిపించాడు. కేవలం 29 బంతుల్లోనే 50 పరుగులు చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా రెండో విజయం సాధించి పంజాబ్ పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది.
Follow Us