ఆసియా ఛాంపియన్స్‌లో ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళిన భారత మహిళల హాకీ జట్టు

మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు విజృంభించేస్తోంది. బీహార్‌‌లో రాజ్‌గి వేదికగా జపాన్‌తో జరిగిన సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో 2–0 తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది.  రేపు టీమ్ ఇండియా చైనాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.

New Update
india

Hockey Indian Women Team: 

మహిళల ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీలో అంచనాలకు తగ్గట్టుగానే భారత్ రాణిస్తోంది.  ఈరోజు జపాన్‌తో జరిగిన సమీ ఫైనల్స్ మ్యాచ్‌లో నెగ్గి‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బిహార్‌లోని రాజ్‌గిర్‌ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. లీగ్‌ దశ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత మహిళ జట్టు వరుస విజయాలను సాధించుకుంటూ వస్తోంది. ఇప్పుడు సెమీ ఫైనల్‌లోనూ అదే దూకుడు కనబరిచింది. 

Also Read: HYD: వాళ్లు నమాజ్ చేస్తే...తాము చాలీసా చదువుతాము..రాజాసింగ్‌ వార్నింగ్

ఈరోజు సెమీ ఫైనల్‌ మ్యాచ్ మొదలయ్యాక మొదటి 3 క్వార్టర్స్‌లో ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు ఆడాయి. మూడు సెట్లు పూర్తయ్యేంత వరకూ ఇండియా, జపాన్ కూడా ఒక్క గోల్ చేయలేకపోయాయి. దీతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. ఇక నాలుగో క్వార్టర్‌‌లో మాత్రం ఒత్తిడిని చిత్తు చేస్తూ భారత ప్లేయర్స్ 2 గోల్స్‌ వేశారు. భారత వైస్‌ కెప్టెన్‌ నవీనీత్‌ కౌర్‌ మొదటి గోల్‌ చేయగా.. లాల్‌రెమ్సియామి రెండో గోల్‌ చేసింది. మరోవైపు చైనా, మలేసియా జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్‌లో 3-1 తేడాతో డ్రాగన్‌ జట్టు విజయం సాధించింది. దీంతో రేపు ఫైనల్స్‌లో చైనా, భారత్‌ జట్లు తలపడనున్నాయి.

Also Read: Russia: ఉక్రెయిన్‌పై న్యూక్లియర్ అటాక్‌కు రెడీ అవుతున్న రష్యా

అంతకు ముందు థాయ్ లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళలు చితక్కొట్టేశారు. 13 - 0 తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. దీంతో భారత్ సెమీ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అసలు మ్యాచ్ మొదటి నుంచీ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఇందులో అవతలి థాయ్‌లాండ్‌ టీమ్ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. మరవైపు మన భారత జట్టులో యువ స్ట్రైకర్ దీపిక  (3వ, 19వ, 43వ 45వ, 45వ నిమిషం) ఐదుసార్లు గోల్స్‌తో సత్తా చాటింది. ప్రీతి దూబే (9వ, 40వ), లాల్‌రెమ్‌సియామి (12, 56వ),  మనీషా చౌహాన్‌ (55వ, 58వ), తలో రెండు గోల్స్‌ చేశారు. బ్యూటీ  డంగ్‌డంగ్ (30వ), నవ్‌నీత్ కౌర్ (53వ) చెరో గోల్ సాధించారు. 

Also Read: India: త్వరలో భారత్‌కు రష్యా అధ్యక్షుడు

Also Read: వారిని పక్కాగా ఊచలు లెక్కబెట్టిస్తా.. వరంగల్ లో రేవంత్ సంచలన స్పీచ

Advertisment
Advertisment
తాజా కథనాలు