అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్! భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘ఈ స్పిన్నర్‌ను పక్కన పెట్టొచ్చు కదా’ అంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టుపై మండిపడ్డాడు. 'అసలు మీ ప్రాబ్లమ్ ఏమిటి? డబ్బుల కోసం ఇలా చేస్తున్నారా? వ్యక్తిగత ద్వేషం ఉందా?' అంటూ చురకలంటించాడు. By srinivas 20 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kuldeep yadav: భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. ‘ఈ స్పిన్నర్‌ను పక్కన పెట్టొచ్చు కదా’ అంటూ కుల్దీప్ ఫొటోకు క్యాప్షన్ జోడించి నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుల్దీప్ తనదైన స్టైల్ లో ప్రశ్నలు సంధించాడు. Sabki pelai ho rhi butIs bkl ko koi kyun nhi pel rha ... pic.twitter.com/rKBsXmTTYN — Manas26 (@Manas263) November 19, 2024 వ్యక్తిగత ద్వేషం ఉందా? ఈ మేరకు 'అసలు మీ ప్రాబ్లమ్ ఏమిటి? ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం వల్ల మీకు డబ్బులు వస్తాయా? లేదంటే నాపై మీకేమైనా వ్యక్తిగత ద్వేషం ఉందా?' అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. కుల్దీప్ ఫ్యాన్స్ ఆ నెటిజన్ పై ఫైర్ అవుతున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: శృంగారం కోసం 300 కి.మీ ప్రయాణించిన పులి.. సహచరి ఎక్కడ దొరికిందంటే! ఇదిలా ఉంటే.. ఎల్లుండినుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టనున్నాడు. మొదటి టెస్టు జరిగే పెర్త్ పేస్‌కు అనుకూలంగా ఉండనుంది. దీంతో కనీసం నలుగురు పేసర్లు, ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారత తుది జట్టు (అంచనా)జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, సిరాజ్, ఆకాశ్ దీప్. ఇది కూడా చదవండి: మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. కేవలం రూ.2 లక్షలకే.. #netizens #kuldeep-yadav #worldcup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి