Cricket: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం

జోహోన్నెస్ బర్గ్‌లో  దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌ 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తుఫాను ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా బ్యాటర్లు తిలక్ వర్మ, సంజూ శాంసన్‌లు చెలరేగిపోయారు. 

New Update
cric

India Vs South Africa T20 Match: 

టీమ్ ఇండియా ధాటికి సౌత్ ఆఫ్రికా జట్టు బెంబేలెత్తిపోయింది. తమ ఆట మర్చిపోయి..గెలుపును భారత వశం చేసేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్‌ 135 పరుగుల తేడాతో అద్వితీయ విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటంగ్ చేసిన టీమ్ ఇండియా చెలరేగిపోయింది. భారత్ బ్యాటర్లలో తిలక్‌ వర్మ (120*: 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజు శాంసన్‌ (109*: 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీలతో సౌత్‌ ఆఫ్రికా మీద దండయాత్ర చేశారు. దీంతో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగులు భారీ లక్ష్యాన్ని ఇచ్చింది టీమ్ ఇండియా. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సఫారీలు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్‌ పటేల్‌ 2,  హార్దిక్ పాండ్య, రవి బిష్ణోయ్‌, రమణ్‌దీప్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా నెమ్మదిగా ఆటను ప్రారంభించింది. తర్వాత నెమ్మదిగా పుంజుకున్నారు. ఆ తరువాత విజృంభించేశారు. సంజు శాంసన్, తిలక్ వర్మ పోటీ పడి మరీ స్టేడియంలో పరుగుల వరద పారించారు.  సంజు శాంసన్ 56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 111 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లు బాది 120 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ సెంచరీలతో సంజూ, తిలక్‌లు వరల్ట్ రికార్డ్ క్రియేట్ చేశారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‎లో రెండో వికెట్‎కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా సంజు శాంసన్, తిలక్ వర్మ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. అంతకు ముందు కూడా ఈ రికార్డ్ పేరిటే ఉంది.  2022, జూన్ 28న ఐర్లాండ్‌పై భారత బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్,  దీపక్ హుడా రెండో వికెట్‎కు 176 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటి వరకు టీ20ల్లో సెకండ్ వికెట్‎కు ఇదే హ్యాయొస్ట్ పార్ట్‎నర్‎షిప్. ఇప్పుడు ఈ రికార్డ్‌ను  సంజు శాంసన్, తిలక్ వర్మ జోడి బద్దలు కొట్టింది. వీరిద్దరూ రెండో వికెట్‎కు 86 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు చేసి టీ20ల్లో రెండో వికెట్‎కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా చరిత్ర సృష్టించారు.

Also Read: Cricket: మళ్ళీ తండ్రయిన రోహిత్ శర్మ

 

 

 


 

Advertisment
Advertisment
తాజా కథనాలు